అది 2018 జూన్ 7 తేదీ, భారత దేశంలోని అతి పెద్ద నగరాలలో ఒకటైన నాగపూర్ నగరంలో వాతావరణం పొడిపొడిగా, చాలా హాయిగా ఉంది.  ఆ నగర వాసులకు తెలీదు తాము నివశిస్తున్న నగరం పేరు మరి కొద్ది గంటల్లో ప్రంపంచ వార్తా ఛానళ్లలో ప్రముఖంగా వినిపించ బోతున్నదని. పత్రికా రంగంతో పరిచయాలున్న వారు మినహా మిగిలిన జనం అంతా కూడా ఆనాడు  అక్కడ జరిగిన సంఘటన గురించి ఇప్పటికీ చర్చించుకుంటూనే ఉన్నారు.
రాష్ట్రపతిగా పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ప్రణబ్ ముఖర్జీ చివరి సారిగా  2018లో తిరిగి వార్తల్లోకి ఎక్కారు.  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) కేంద్ర కార్యాలయాన్ని ఆయన సందర్శించిన సమయం అది. అప్పటికే ఆయన రాష్ట్రపతి బాధ్యతల నుంచి తప్పుకుని ఉన్నారు. ప్రజా జీవితం నుంచి , రాజకీయల నుంచి కూడా చాలా దూరంగా  జీవనం సాగిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆయనను ఆర్ ఎస్ ఎస్ కార్యాలయానికి వెళ్లకుండా చేసేందుకు చాలా చాలా ప్రయత్నాలు చేసింది.  ఆయన సన్నిహితులు, అనుచరుల ద్వారా ఒత్తిడి చేసింది. ఎవరి ఒత్తిడులకు తలోగ్గకుండా ప్రణబ్ ముఖర్జీ ఆర్.ఎస్.ఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ జరిగిన కార్యక్రమలో పాల్గోనడమే కాకుండా ప్రసంగించారు కూడా. ఆ రోజు  ముఖర్జీ తీసుకున్న సాహసోపేత నిర్మయం ఆయనకు 2019లో భారత రత్న బిరుదు వచ్చేందు ఉపకరించిందని నాటి ప్రసార మాధ్యమలు పేర్కోన్నాయి. చివరి రోజుల్లో ప్రణబ్ ముఖర్జీ స్వీయ రచనాంగం పై దృష్టిసారించారని అతని సన్నిహితులు పేర్కోంటున్నారు.  ఆయన తన కలానికి పదను పెట్టారని, రెడ్ డైరీస్ పేరుతో మూడు సంపుటాలు రాయాలని సంకల్పించారని వారు తెలిపారు. అందులో ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. కొన్ని దశాబ్దాలుగా భారత్ లో వచ్చిన మార్పులు, ముఖ్యంగా మతపరమైన  అంశాలలో చోటుచేసుకున్న కొత్త పోకడలను ఆయన తన రచనల్లో ప్రస్తావించారు. ప్రభుత్వాల ఉదాశీన వైఖరిని తూర్పారబట్టారు. ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తే దేశంలో పెద్ద దుమారమే రేగుతుందని  ఆయన సన్ని హితులతో పేర్కోన్నారు.  ప్రణబ్ ముఖర్జీ తన రచనలన్నింటినీ  కుమార్తె  శర్మిష్టా ముఖర్జీకి అందించారు.
ప్రస్తుతానికైతే ప్రణబ్ ముఖర్జీ  రాసిన డైరీలు ఎక్కడ ఎలా ఉన్నాయనే విషయం ఎవరికీ తెలీదు. ఏదో ఒక రోజు అవి ప్రపంచానికి తెలుస్తాయి. అందులో ప్రణబ్ రాసిన విుషయాలన్నీ మానవాళికి అవగతమవుతాయి.  అలా జరిగితే ఆయన మరోసారి మరణానంతరం కూడా  తిరిగి వార్తల పతాక శీర్షికల్లోకి ఎక్కే అవకాశం మాత్రం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: