సార్ రమ్మంటున్నారు, మీతో మాట్లాడతారట అంటూతెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మీడియా వాాళ్లకి ఫోన్ వచ్చింది. విజయవాడలో మద్రాసు హై కోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రు వ్యాఖ్యలకు తిరిగి కౌంటర్ ఇవ్వాలనుకున్నారో ఏమో...అని మీడియా జనం అంతా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు విలేఖరుల సమావేశానికి పోలో మని వెళ్లారు. ఆయన చర్విత చరణంగా చెప్పిందే చెప్పారు. చేసిన డిమాండే మరలా చేశారు. అదేంటో మరోసారి చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం చాలా విషయాలలో క్లారిటీగా సమాధానం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది అని టిడిపి అధినేత విమర్శల వర్షం కురిపించారు.
ప్రత్యోక హోదా కోసం పోరాడుతూనే ఉంటామని వై.ఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇది ముగిసిన అధ్యాయమని ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏం సమాధానం చెబుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్లు ప్రకటన చేస్తుంటే వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెడుతూ పరిపాలన సాగించ లేరని తెలిపారు. పాలనానుభవం లేని వ్యక్తులు పరిపాలన వల్లనే రాష్ట్రం అప్పుల పాలేందని విమర్శించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎం.పీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిండు సభలో నిలదీయకుండా మిన్నకుండి పోయారని, ఇది దేనికి సంకేతమని మాజీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. విశాఖ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం గా లేదని విమర్శించారు. విశాఖ కు రైల్వే జోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించిందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని అన్నారు. ముఖ్యమంత్రి సొంత ప్రయోజనల కోసమే రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని, ప్రజలు దీనిని గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు.
రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్తు కోసం కేంద్రం పై పోరాటం చేసేందుకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు రాజీనామాచేసి ముందుకు వస్తే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులుకు తమ పదవులకు రాజీనామా చేస్తారని నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ఒక్క విషయంలో వైఎస్ ఆర్ సిపితో కలసి నడిచేందుకు తాము సిద్ధమని మాజీ ముఖ్యమంత్రి పేర్కోన్నారు.
ఆయన ప్రసంగంలో నాటి విశాఖ ఉక్కు ఉద్యమం నాటి స్లోగన్ లను మరలా మరలా పేర్కోన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం. విశాఖ ఉక్కు కర్మాగారం అరంభం నాటిది. కానీ నేటి విలేఖరుల సమావేశంలోనూ చంద్రబాబు నాయుడు కూడా అదే నినాదాన్ని మరలా మరలా అనడం విశేషం.