ఎంతసేపు జగన్‌మోహన్‌రెడ్డికి 152 సీట్లు ఇచ్చారు అని, 22 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు నాకు ఇవ్వలేదు అనే ఏడుపు తప్ప ఏమి లేదు అన్నారు అంబటి. విశాఖ ఉక్కు అనేది కేంద్ర ప్రభుత్వ ఆస్తి అని, వాళ్లు ప్రయివేటీకరణ చేస్తాం అన్నారు. మేము కాదు చేయడానికి వీలు లేదని అన్నామని.. పలుమార్లు విజ్ఞప్తి కూడా చేసామని గుర్తు చేసారు. పార్లమెంట్‌లో ప్రశ్నించామని, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామని వెల్లడించారు అంబటి. ఆయన పార్ట్‌నర్ షిఫ్ అలాగే కంటిన్యూ చేస్తాడట.. మా మీద విమర్శలు చేస్తాడట.
మమ్ముల్ని తిట్టడం కోసం, విమర్శించడం కోసం రాజకీయాలు చేస్తున్నారా.. లేక ప్రజల కోసం రాజకీయాలు నడుపుతున్నారా అని ప్రశ్నించారు. మరీ వారసత్వ రాజకీయాలు లేని వ్యక్తి మోడీ అని అందుకే మోడీతో స్నేహంగా ఉన్నానని చెప్పారని.. మరీ చంద్రబాబుతో కూడా స్నేహంగా ఉన్నారు కదా అని ప్రశ్నించారు అంబటి. రాజకీయాల్లోనే వారసత్వానికి వ్యతిరేకమా.. సినిమాల్లో వారసత్వానికి వ్యతిరేకం కాదా.. పవన్‌కల్యాణ్‌గా నిలబడడానికి కారణం ఎవరు అని.. వారందరినీ మరిచిపోయావని అంబటి గుర్తు చేసారు. మీ సినిమాలు ఆపాల్సిన కర్మ మాకు ఏమిటి..? ఆన్‌లైన్‌లో టికెట్లు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని.. అందుకే ప్రభుత్వం కూడా కోరుకుంటుందని, అదేవిధంగా నిర్మాతలు కూడా కోరుకుంటున్నారని అంబటి తెలిపారు.