తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంచలన పథకాలలో షాదీ ముబారక్, కళ్యాణ  లక్ష్మి పథకం కూడా ఒకటి. ఈ పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది ప్రభుత్వం. ఒకప్పుడు కేవలం 50 వేల రూపాయలు మాత్రమే ఈ పథకం ద్వారా అందించగా ప్రస్తుతం లక్ష రూపాయలు అందిస్తోంది. అయితే మొదట్లో కల్యాణలక్ష్మి పథకం ఎంతో పకడ్బందీగా అమలు అయింది. ప్రభుత్వం చెప్పిన విధంగానే పెళ్లికి ఒక్క రోజు ముందు  కల్యాణ లక్ష్మి డబ్బులు అందుకున్నారు లబ్ధిదారులు.



 కానీ ఆ తర్వాత మాత్రం సరైన సమయానికి డబ్బులు చేతికి రాని పరిస్థితి ఏర్పడింది. పెళ్లి జరిగి నెలలు గడుస్తున్నా ఇంకా కళ్యాణ లక్ష్మి  డబ్బులు రాని లబ్ధిదారులు ఎంతోమంది ఉన్నారు అని చెప్పాలి. ఎన్నో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇలా లబ్ధిదారుల దరఖాస్తులు పెండింగ్లో ఉంటే ఇక్కడ మాత్రం ఏకంగా దరఖాస్తు చేసుకోని  వారికి కళ్యాణ లక్ష్మి డబ్బులు వస్తూ ఉండడం గమనార్హం. అది కూడా 50 ఏళ్ల కిందట పెళ్లి జరిగిన వారికి ఇప్పుడు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. అది కూడా ఒక్కసారి కాదు ఏకంగా రెండు మూడు సార్లు కల్యాణలక్ష్మి డబ్బులు జమ అవుతూ ఉండటం గమనార్హం.  ఇలా ఇటీవలి కాలంలో ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి.


 ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కి చెందిన 67 ఏళ్ల శకుంతల భాయ్ కి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉండగా వారికి 15 ఏళ్ల కిందటే పెళ్లి జరిగింది. కాగా శకుంతల బ్యాంకు ఖాతాలో కళ్యాణ లక్ష్మి పథకం కింద రెండు సార్లు డబ్బులు జమ అయ్యాయి. సిరికొండ మండలానికి చెందిన 65 ఏళ్ల సుమన్ బాబు బ్యాంకు ఖాతాలో ఏకంగా మూడుసార్లు కల్యాణలక్ష్మి కింద ఆర్థిక సాయం జమ కావడం గమనార్హం. ఇచ్చోడ మండలం చించోలి కు చెందిన 70 ఏళ్ల గంగుబాయి ఖాతాలో రెండుసార్లు కల్యాణలక్ష్మి ఆర్థిక సహాయం జమ అయ్యింది. అయితే పదేళ్ల కిందటే ఈమె భర్త కూడా మరణించడం గమనార్హం. అయితే ఇలా జరగడానికి సాంకేతిక సమస్యలు కారణం కాదని పథకాల విషయంలో జరుగుతున్న అక్రమాల కారణమని అంటున్నారు విశ్లేషకులు.. ప్రభుత్వం ఇప్పటికైనా పథకాలు అమలు విషయంలో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: