తెలంగాణ‌లో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు న‌వంబ‌ర్ 9న  షెడ్యూల్‌ విడుదల అయింది. అందులో  ఆరు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన ఆరు స్థానాల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండు, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్‌ ఉమ్మడి జిల్లాలలో ఒక్కో స్థానానికి ఈ నెల 10న ఎన్నిక‌లు జ‌రిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 మంది అభ్యర్థులు బ‌రిలోనిలిచారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండు స్థానాలకు 10 మంది, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక స్థానానికి ఏడుగురు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇద్దరు, ఖమ్మంలో నలుగురు, ఉమ్మ‌డి మెదక్‌లో ముగ్గురు అభ్య‌ర్థులు పోటీలో నిలిచారు. అయితే మూడు స్థానాల‌లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి  గట్టి పోటీని ఎదుర్కొంటున్న‌ది.  ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం స్థానాల్లో క్రాస్‌ఓటింగ్‌ జరిగినట్టు రాజకీయ విశ్లేషకులు  పేర్కొంటున్నారు.  ఆదిలాబాద్ లో స్వ‌తంత్ర అభ్య‌ర్థి పుష్ప‌రాణి,  టీఆర్ఎస్ అభ్య‌ర్థి దండె విఠ‌ల్ పోటీలో నిల‌వ‌డంతో ఈ స్థానంలో ఎవ‌రు గెలుస్తార‌ని ఉత్కంఠ నెల‌కొంది. ముఖ్యంగా కాంగ్రెస్‌, బీజేపీల మ‌ద్ద‌తు స్వ‌తంత్ర అభ్య‌ర్థికి ప్ర‌క‌టించ‌డంతో.. 937 ఓట్ల‌కు 860 ఓట్లు పోల‌య్యాయి. అధికార పార్టీ అభ్య‌ర్థి 90 శాతం ఓట్ల‌తో విజ‌యం సాధిస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తుంటే.. మ‌రోవైపు స్వ‌తంత్ర అభ్య‌ర్థి కూడా క్రాస్ ఓటింగ్ జ‌రిగింద‌ని.. తామే  విజ‌యం సాధిస్తామ‌ని పేర్కొంటున్నారు.

క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ఎలాగైనా టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాల‌ని నిర్ణయించుకోవ‌డంతో.. మ‌రోవైపు తామే గెలుస్తాం అని అధికార టీఆర్ఎస్ గెలుపుధీమా వ్య‌క్తం చేస్తోంది. క‌రీంగ‌న‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో బ‌రిలో ఉన్న స్వ‌తంత్ర అభ్య‌ర్థి ర‌వీంద‌ర్‌సింగ్‌, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు ప్ర‌భాక‌ర్‌రెడ్డి మ‌ధ్య ప్ర‌ధాన పోటీ ఉండ‌డంతో ఎవ‌రికీ వారు గెలుపు ధీమాలో ఉన్నారు. ఇక ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో  టీఆర్ఎస్ నుంచి కోటిరెడ్డి గెలిచే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని టాక్ వినిపిస్తోంది. 1237 ఓట్లు పోల‌వ్వ‌గా.. టీఆర్ఎస్ అభ్య‌ర్థి 1000 ఓట్ల‌కు పైగా వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. పోటీలో స్వ‌తంత్ర అభ్య‌ర్థులు ఉండ‌డంతో ఓట్లు అన్ని చీలిపోవ‌డంతో అధికార పార్టీకే ఎక్కువ ఓట్లు ల‌భించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఖ‌మ్మం గుమ్మంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో 768 ఓట్ల‌కు 738 ఓట్లు పోల‌య్యాయి. టీఆర్, కాంగ్రెస్ మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొన్న‌ది ఖ‌మ్మంలో. ఓవైపు టీఆర్ఎస్ తామే గెలుస్తాం అనే ధీమాలో ఉండ‌గా.. మ‌రోవైపు టీఆర్ఎస్ నుంచి క్రాస్ ఓట్లు వ‌చ్చాయ‌ని కాంగ్రెస్ భావిస్తుంది. మొత్తానికి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో  గెలుపు ధీమాలో ఎవ‌రికీ వారే తామే గెలుస్తామ‌ని ప్ర‌క‌టించుకున్నారు.హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో, గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఏవిధంగా గెలిచిందో.. ఇప్పుడు కూడా అదేవిధంగా రెండు మూడు చోట్ల టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వ‌నున్నార‌ని బీజేపీ నాయ‌కులు పేర్కొంటున్నారు. మొత్తానికి   రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ అన్ని సీట్ల‌ను ద‌క్కించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎవ‌రు ఎన్ని సీట్లు ద‌క్కించుకుంటారో ఇవాళ మ‌ధ్యాహ్నం వ‌ర‌కు తేల‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: