అవును క్రాస్ ఓటింగ్ జరిగింది.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు తెలంగాణ మంత్రి. తెలంగాణ భవన్ సాక్షిగా ఆయన ఈ మాట ఆన్ ది రికార్డుగా అనేశారు. ఇంతకీ ఎవరా మంత్రి ? ఎందుకలా వ్యాఖ్యానించారు ?
తెలంగాణ భవన్ సందడిగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ పండుగ వాతావరణం తొణికిస లాడుతోంది. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గొడ్ అక్కడికి వచ్చారు. అక్కడ పార్టీ శ్రేణులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. ఎన్నికల విజయం పై తనదైన వ్యాఖ్యలు చేశారాయన. ప్రజలంతా తెలంగాణ రాష్ట్ర సమితి వైపు చూస్తున్నారని తెలిపారు. అందరు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిపాలనను మరికొంత కాలం కోరుకుంటున్నారని అన్నారు. అంతటితో అగలేదు ప్రతిపక్ష సభ్యుల ఓట్లు చాలా వరకు టిఆర్ ఎస్ కు పడ్డాయని చెప్పారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ సభ్యులు చాలా మంది టి.ఆర్.ఎస్ అభ్యర్థులకు ఓటు వేశారని ప్రకటించారు. ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖర్ రావుచేసినఅభివృద్ధి పనులను చూసి వాటు ఓట్ల వర్షం కురిపించారన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల వల్ల ప్రతిపక్ష సభ్యులు ఎక్కువ లబ్ది పొందారని తెలిపారు. అందువల్లే వారు టిఆర్ ఎస్ ఓటు వేశారని కూడా అన్నారు. అధికార పార్టీ ఓట్లు తమకు పడతాయని, అధికా పార్టీ సభ్యులు తమవేైపు ఉన్నారని, భారతీయ జనతా పార్టీ, కాంగ్రేస్ లు రెండూ పగటి కలలు కంటున్నాయని, అది ఎన్నటికీ జరగదని మంత్రి వ్యాఖ్యానించారు. త్వరలో టిఆర్ ఎస్ జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తుందని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు త్వరలోనే దేశమంతటా అమలవుతాయని తెలిపారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదని కూడా మంత్రి శ్రీనివాస గౌడ్ వ్యాఖ్యానించారు. ఎం.పి.టి.సి సభ్యులకు సంబంధించి కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, త్వరలోనే ముఖ్యమంత్రి కె.సి.ఆర్ వాటిని పరిష్కరిస్తారని మంత్రి శ్రీనివాస గౌడ్ తెలిపారు.
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తమ పార్టీకి చెందిన అభ్యర్థులను,ఓటర్లను ప్రలోభపెడుతోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీల గగ్గోలు పెట్టారు. శాసన మండలి ఎన్నికలలో గెలిచేందుకు టిఆర్ ఎస్ నానా ట్రిక్కులు ప్రదర్శిస్తోందని కూడా ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేశారు. వీరి ఆరోపణలు నిజం అనే విధంగా మంత్రి వ్యాఖ్యలు ఉండటంతో రాజకీయ పరిశీలకులు నివ్వెర పోయారు.