ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అశోక్ గజపతి రాజుకు చెక్ పెట్టాలని చెప్పి...వైసీపీ సంచయితని తెరపైకి తీసుకొచ్చారు. అనూహ్యంగా వంశ పారంపర్యంగా వస్తున్న మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయ ఛైర్మన్ పదవి నుంచి అశోక్‌ని తొలగించి...సంచయితకు పదవులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ పదవుల్లోకి సంచయిత ఏ స్థాయిలో హైలైట్ అయ్యారో అందరికీ తెలిసిందే. అలాగే ఎలాంటి వివాదాల్లో ఉండేవారు కూడా తెలిసిందే.
తన బాబాయ్ అశోక్ గజపతిపై ఎలాంటి విమర్శలు చేశారో కూడా అందరికీ తెలుసు. పైగా వైసీపీ సపోర్ట్ ఉండటంతో ఆమె ఇంకా దూకుడుగా ఉండేవారు. ఇలా దూకుడుగా ఉండే సంచయితకు అశోక్ చెక్ పెట్టేశారు. కోర్టుకు వెళ్ళి మరీ సంచయితని ఛైర్మన్ పదవి నుంచి దించి...తాను పదవిలోకి వచ్చారు. న్యాయం ప్రకారం తన స్థానాన్ని మళ్ళీ దక్కించుకున్నారు.
అలా పదవి నుంచి తప్పుకున్న తర్వాత నుంచి సంచయిత ఏపీ రాజకీయాల్లో కనిపించడం లేదు. పూర్తిగా ఆమె ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మాత్రం ఏపీలో అడ్రెస్ లేరు. ఇలా ఏపీ రాజకీయాలకు దూరంగా ఉన్న సంచయిత...మళ్ళీ వచ్చే ఎన్నికల ముందు ఏమన్నా ఎంట్రీ ఇస్తారా? అప్పుడు వైసీపీ..సంచయితకు పోటీ చేసే ఛాన్స్ ఇస్తుందా? అనేది చూడాల్సి ఉంది.