తెలుగుదేశం పార్టీలో మంచి టాలెంట్ ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు. డిఫరెంట్ ఐడియాలజీ....ప్రజలకు ఎలా రీచ్ అవ్వాలనే ఆలోచన గల నాయకులు ఉన్నారు. అయితే స్థానిక పార్టీ కావడంతో పూర్తి స్థాయిలో కొందరు నేతలు హైలైట్ అవ్వని పరిస్తితి. దీని వల్ల పార్టీలో కీలక మార్పులు మాత్రం రావడం లేదు. అసలు చెప్పాలంటే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కూడా మంచి టాలెంట్ ఉన్న నాయకుడే అని చెప్పొచ్చు. బాగా చదువుకున్న వ్యక్తి..గీతం విశ్వవిద్యాలయాన్ని నడుపుతున్న నేత. ఈయనకు విద్యార్ధులతో పరిచయాలు ఎక్కువ.

ఇలా ఇలాంటి నాయకుడుని సరిగా వాడుకుంటే టీడీపీకి యువత మరింత దగ్గర అవుతుందనే చెప్పాలి. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్తితుల్లో మెజారిటీ యువత జగన్ వైపే ఉంది..ఆ తర్వాత పవన్‌కు మద్ధతుగా ఉంది. కానీ టీడీపీకి యువత సపోర్ట్ తక్కువ. పైగా టీడీపీలో పూర్తిగా సీనియర్ నేతల హవానే ఎక్కువగా ఉంటుందనే పరిస్తితి. దీని వల్ల యువతని ఆకర్షించే యువ నేతలు తగ్గిపోయారు. అందుకే టీడీపీకి యువత సపోర్ట్ తగ్గింది.

అయితే ఇకనుంచైనా యువతని ఆకర్షించే కార్యక్రమాలు చేయాలి...ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లో యువత ఓట్లు చాలా కీలకంగా మారనున్నాయి. పైగా ప్రతి ఎన్నికకు కొత్త ఓటర్లు వస్తారు. వారు కూడా కీలకంగానే ఉంటారు. కానీ వారంతా జగన్, పవన్‌ల వైపే ఉంటున్నారు గానీ...చంద్రబాబు వైపు రావడం లేదు. ఎందుకంటే చంద్రబాబు సీనియర్ నాయకుడు కాబట్టి. యువత అంతగా ఎట్రాక్ట్ అవ్వడం లేదు.

అయితే టీడీపీలో ఉన్న యువ నేతలని ఉపయోగించుకుని యువ ఓటర్లని ఆకర్షించవచ్చు. పైగా ఇప్పుడు వైసీపీపై కాస్త వ్యతిరేకత ఉంది..ఈ క్రమంలో యువతని తమ వైపుకు తిప్పుకుంటే చాలా బెటర్. బాలయ్య చిన్నల్లుడు లాంటి వారిని ఇంకా వాడుకుని, కాలేజీల్లో డిబేట్ల పెడితే బెనిఫిట్ అవుతుంది. అలా కాకుండా అందరు నారా లోకేష్‌ని డామినేట్ చేసేస్తారని భయపడితే మాత్రం టీడీపీకి ఇబ్బందే.

మరింత సమాచారం తెలుసుకోండి: