అయితే ఈ కోవర్టులు ఇప్పుడు టీడీపీలో ఎక్కువగా కనిపిస్తున్నారు. అసలు ఈ కోవర్టుల వల్ల టీడీపీ దెబ్బతింది అనే వాదన కూడా ఉంది. ఇటీవల కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోవడంపై చంద్రబాబు సైతం సీరియస్ అయ్యి...కోవర్టులని ఏరిపారేస్తానని అన్నారు. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో కోవర్టుల వల్ల టీడీపీకి భారీ డ్యామేజ్ జరిగింది. ఇక అలాంటి నాయకులని చంద్రబాబు తీసి పక్కనబెట్టే పనిలోనే ఉన్నారు.
సరే ఈ కోవర్టుల రాజకీయం టీడీపీకే పరిమితమైందా? అంటే కాదనే చెప్పాలి...వైసీపీలో కూడా కోవర్టులు ఉన్నారనే వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అసలు కొందరైతే...ఏకంగా కొడాలి నాని, వల్లభనేని వంశీలనే కోవర్టులనే పరిస్తితి. అదేంటి వారు జగన్‌కు నమ్మినబంటులు మాదిరిగా పనిచేస్తారు కదా...అలాంటప్పుడు వారిని కోవర్టులు అని ఎలా మాట్లాడుతున్నారనే డౌట్ రాకపోవచ్చు. ఇక్కడే ట్విస్ట్ ఉంది..ఈ ఇద్దరు నేతలు చంద్రబాబుని ఏ రేంజ్‌లో తిడుతున్నారో తెలిసిందే. అలాగే ఇటీవల భువనేశ్వరి విషయంలో కూడా పెద్ద రచ్చ అయింది.
ఈ పరిణామాలు టీడీపీకి బాగా కలిసొచ్చేలా ఉన్నాయి. ఇలా మాట్లాడటం వల్ల వైసీపీకి ప్లస్ రాకపోగా, మైనస్ ఎక్కువయ్యే పరిస్తితి వచ్చింది. ఆ విషయాన్ని సొంత పార్టీ నేతలు కూడా గ్రహించి..కొడాలి, వంశీలపై విమర్శలు చేస్తున్నారు. వీరు వైసీపీలో ఉంటూ..టీడీపీకి పరోక్షంగా సాయం చేస్తున్నట్లు ఉందని మాట్లాడుతున్నారు. మొత్తానికి ప్రత్యర్ధులని తిట్టినా సరే వైసీపీకి ఇబ్బంది అనే విషయాన్ని ఇప్పుడుప్పుడే గమనించినట్లు కనిపిస్తోంది.