హింస, ఘర్షణలు ప్రేరేపించే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని.. కల్వకుంట్ల కుటుంబ పాలనపై తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని చూపించాలన్నారు కిషన్ రెడ్డి.  విష ప్రచారం చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్న trs నేతలను ఉరికించాల‌ని..  ఫైర్ అయ్యా రు కిషన్ రెడ్డి.   హిందు వులను, హిందు దేవతలని కించపరుస్తూ, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారితో పొత్తు పెట్టుకున్నాడని..   కాశీ పునరుద్ధ రణ పై సీఎం కేసీఆర్ కు ఎందుకు బాదనో  కేసీఆర్ యజ్ఞాలు చేయొచ్చు- బీజేపీ మాత్రం చేయొద్ద?  అని నిల‌దీశారు కిషన్ రెడ్డి.

 
కేసీఆర్ రైతులను భయపెడితు- మోసం చేస్తున్నారు...తెలంగాణ ఉద్యమంలో కూడా కెసిఆర్ ధర్నాకు రాలేదని చుర‌క‌లు అంటించారు కిష‌న్ రెడ్డి.   లేని సమస్య పై ఇందిరా పార్కు లో ధర్నా చేశారు హుజురాబాద్ ఓటమి మంట కేసీఆర్ లో కనిపిస్తుందన్నారు కిష‌న్ రెడ్డి.   రబీ లో 44.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం అంగీకరించింది...ఇప్పటి వరకు FCIకి 30.50లక్షల మెట్రిక్ టన్నుల బియ్యన్నీ మాత్రమే ఇచ్చిందన్నారు కిష‌న్ రెడ్డి.

 
14.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం FCI కి ఇవ్వాల్సిన పెండింగ్ ఉంది.ఇప్పటి వరకు ఇవ్వాల్సిన టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఎందుకు ఆలస్యం చేస్తోందో చెప్పాలి?  అని నిల‌దీశారు కిష‌న్  రెడ్డి.   గత ఏడాది ఖరీఫ్ లో 20 లక్షల మెట్రిక్ టన్నులు లక్ద్యం కాగా 32.71లక్షలు  బియ్యం సేకరించాం.ఈసారి టార్గెట్ పెంచి 40లక్షలకు పెంచా మ  న్నా రు కిష‌ న్ రెడ్డి. వచ్చే రబీ గురించి దేశంలో ఏ రాష్ట్రానికి టార్గెట్ ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాలతోనే తెలంగాణకు టార్గెట్ ఇస్తామ‌న్నారు కిష‌న్ రెడ్డి.   తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పంటను ఎందుకు కొనడం లేదు? అని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు కిష‌న్ రెడ్డి. 

మరింత సమాచారం తెలుసుకోండి: