'నేడు అందరూ ఢిల్లీ గురించి మాట్లాడుతున్నారు... రేపు అందరూ ఆంధ్ర ప్రదేశ్ గురించే మాట్లాడాలి'... అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ పిలుపు ఇస్తున్న సమయంలో ఆయన గొంతు స్పష్టంగా ఉన్నట్లు అనిపించింది. తాను అనుకున్న పనిని అనుకున్నట్లు సాధించుకునే పట్టుదల  అక్కడి వారికి కనిపించింది.  ఎందరో రాజకీయ నాయుకులను దగ్గర నుంచి చూసిన ముఖ్యమంత్రి కార్యాలయ అధికార గణం  కొత్త అధికార పీఠాన్ని చూస్తున్నారు.  తాము చదువుకున్న సర్కారు బడులు కొత్త రూపు సంతరించుకోనుండటం పై వారు  లోలోపలే హర్షం వెలిబుచ్చారు.
ముఖ్యమంత్రి పేషీలో పని చేస్తున్న వారిలా చాలా వరకూ సీనియర్లే.  దేశంలో ప్రైవైటు స్కూళ్ల హవా   సుమారు  పాతికేళ్ల క్రిందట మాత్రమే ఆరంభమైంది. అక్కడ ఉన్న వారిలో చాలా మంది  దాదాపు పాతికేళ్లకు ముందు  సర్కారు బడుల్లో విద్యను అభ్యసించిన వారే కావడం తో వారి మనసుల్లో  ఏదో తెలియని ఆనందం తొణికిస లాడింది.   నాడు- నేడు కార్యక్రమం ద్వారా సర్కారు బడులను  సమమూలంగా ఆధునీకరించేందుకు ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ నడుంబిగించింది. పెద్ద లక్ష్యాలనే ఏర్పరచుకుంది.
 పేద ప్రజలపై ప్రైవేటు స్కూళ్ల దోపిడీని అరికట్టాలని వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తలంచారు. వారి దోపిడికి గురవుతున్న ప్రజల ఆకాంక్షలను గుర్తించారు.  సర్కారు బడులను బాగు చేయడం ఎలా అన్న విషయమై తనకు నమ్మకంగా ఉన్న అధికారలనుంచి నివేదిక తెప్పించుకున్నారు.  కూలిపోయే భవనాలు, అరకొర వసతులు, ఫ్యాన్లు, లైట్లు , నల్ల బల్లలు,కూడా లేకపోవడం తదితర బలమైన కారణాలతో  ఎక్కువ శాతం మంది విద్యార్థులు సర్కారు బడులకు దూరమవుతున్నారని అధికారులు నివేదిక ఇచ్చారు. సర్కారు బడుల్లో వసతుల లేమి కారణంగానే పెద ప్రజలు అప్పో సొప్పో చేసి తమ పిల్లలలను కాన్వెంట్ స్కూళ్లకు పంపుతున్నారని ముఖ్యమంత్రి గ్రహించారు. దీంతో సర్కారు బడులను అభివృద్ధి చేస్తే  పేద ప్రజల విద్యా అవసరాలు తీర్చిదిద్దినట్లవుతుందని వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించారు. అనుకున్నదే తడవుగా కార్యాచరణ ఉపక్రమించారు.
నాడు - నేడు పథకానికి  15 వేల కోట్ల రూ పాయలు కేటాయించింది ప్రభుత్వం. నిధుల నివియోగంలో భాగంగా.. రాష్ట్రం లోని 45 వేలకు పైగా ఉన్న సర్కారు బడులను మూడు దశలుగా విభజించారు.  తొలి దశలో 1,412 కోట్ల రూపాయలను వెచ్చించి  సర్కారు బడుల సమూలంగా మార్చారు. తొలి దశలోనే  ఆశించిన ఫలితాన్ని వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాబట్టింది.  కరోనా ప్రభావం కొంత తగ్గుముఖం పట్టిన వేళ తల్లితండ్రులు తమ పిల్లలను  బడులకు పంపించడం ఆరంభించారు. ఈ ధఫా వారు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు కాకుండా సర్కారు బడులకు పంపిచడం విశేషం. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ విద్యా సంవత్సరంలో  సర్కారుబడుల్లో ప్రవేశాలు దాదాపు 30 శాతం మేర పెరగడమే ఇందుకు  నిదర్శనం. నాడు- నేడు పథకం అమలు తీరుపై కేంద్ర మానవ వనరుల శాఖ  ప్రశంసల జల్లు కురిపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: