ఒకప్పుడు పాకిస్థాన్ ప్రభావం కాశ్మీర్ ప్రజలపై ఎక్కువగా ఉండేది. దీంతో ఎంతో మంది యువత ఉగ్రవాదాన్ని ఉపాధిగా ఎంచుకునే వారు. కానీ 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడి యువతలో కూడా ఎంతగానో మార్పు వచ్చింది. ఈ క్రమంలోనే యువత అందరికీ కూడా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రస్తుతం భారత ప్రభుత్వం ముందడుగు వేస్తోంది అని చెప్పాలి. దేశవ్యాప్తంగా రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం ఎస్సీ, ఎస్టి రిజర్వేషన్లు అన్ని రాష్ట్రాలలో కూడా అమలులో ఉన్నాయి. కానీ మొన్నటి వరకు 370 ఆర్టికల్ అమలులో ఉండటంతో అటు కాశ్మీర్ ప్రాంతంలో మాత్రం ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలులో లేవు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్లో సర్వే నిర్వహించడం కోసం ఒక కమిటీని కూడా నియమించారు.
ఇలా కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన కోసం వేసిన కమిటీ అటు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. జమ్మూకాశ్మీర్లో 43 కాశ్మీర్లో 47 నియోజకవర్గాలను విభజించి నట్లుగా ఈ నివేదిక చెప్పింది. అదే సమయంలో ఇక ఎస్సీ ఎస్టీ నివేదికను కూడా వెల్లడించారు. అయితే 9 సీట్లు అటు ఎస్సీ లకు రిజర్వేషన్ ఉండగా.. 7 సీట్లు ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది. ఇలా కాశ్మీర్లో మరికొన్ని రోజుల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు కాబోతున్నట్లు తెలుస్తోంది.