టీడీపీ అధినేత చంద్రబాబులో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. గతానికి భిన్నంగా చంద్రబాబు తీరు ఉంది..గతంలో ఏదో చూసి చూడనట్లుగానే ఉన్నారు. ఏ టీడీపీ నాయకుడుని కూడా పెద్దగా కదిలించలేని పరిస్తితి. పైగా పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో బాబు సైలెంట్‌గానే ఉన్నారు. నాయకులు సరిగ్గా పనిచేయకపోయినా సరే లైట్ తీసుకున్నారు. మళ్ళీ ఏ నాయకుడుని కదిలిస్తే పార్టీ మారిపోతామని అంటారో లేక సైలెంట్ అయిపోతారో అని చెప్పి బాబు పెద్దగా నాయకుల మీద ఒత్తిడి తీసుకు రాలేదు.
కానీ ఇప్పుడు బాబులో పూర్తిగా మార్పు కనిపిస్తోంది. పనిచేయని నాయకులని పక్కన పెట్టడానికి ఏ మాత్రం ఆలోచించడం లేదు. మొహమాటం లేకుండా నాయకులని సైడ్ చేసేస్తున్నారు. ఇంకా పనిచేయని నాయకులని మోయడానికి చంద్రబాబు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం చాలా ముఖ్యం. మళ్ళీ పార్టీ గానీ అధికారంలోకి రాకపోతే...పార్టీ భవిష్యత్ ప్రశ్నార్ధకం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అందుకే పార్టీని పైకి తీసుకురావడానికి నియోజకవర్గాల వారీగా గెలుపు గుర్రాలని పెడుతూ వస్తున్నారు. అలాగే ప్రజల్లోకి వెళ్లని నాయకులని సైడ్ చేసేస్తున్నారు. మళ్ళీ వారికి ఛాన్స్ ఇవ్వడం కష్టమే అని చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో నాయకులని మార్చేశారు. ఇంకా మరికొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేయడానికి బాబు సిద్ధంగా ఉన్నారు. దీంతో టీడీపీ నేతలు అలెర్ట్ అయ్యారు. తమ ఇంచార్జ్ పదవులని కాపాడుకోవడానికి రంగంలోకి దిగారు. ఇంతకాలం నియోజకవర్గాల్లో కనిపించని నాయకులు..ఇప్పుడు హడావిడిగా పనులు చేస్తున్నారు.
అలాగే ఇటీవల చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు పెడుతూ...ఇంచార్జ్‌లని ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే మార్పులు తప్పవనే సంకేతాలు వస్తుండటంతో కొందరు నేతలు..బాబుని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఈ సారికి వదిలేయాలని...ఇక నుంచి సరిగ్గా పనిచేస్తామని, గతంలో ఏదో కరోనా వల్ల, లాక్‌డౌన్ వల్ల సరిగ్గా పనులు చేయలేకపోయామని, ఈ సారి ఖచ్చితంగా చేస్తామని, తమ పదవులు ఉంచాలని కోరుతున్నారు. అయితే మళ్ళీ సరిగ్గా పనిచేయకపోతే మళ్ళీ పక్కన పెట్టేస్తామని బాబు హెచ్చరిస్తున్నారు.