క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్  కు తాను మందిస్తానన్న ఆనందయ్య ప్రతిపాదనను ఆయుష్ శాఖ తిరస్కరించింది. ఎవరు కూడా ఏదిపడితే ఆ మందు వాడకండని సర్టిఫైడ్ ఆయుర్వేదం, హోమియో డాక్టర్ల దగ్గర మాత్రమే మందులు తీసుకోవాలని ఆయుష్ శాఖ స్పష్టంగా ప్రకటించింది. ఆయుష్ శాఖ చేసిన ప్రకటన ఎలాగుందంటే ఆనందయ్య ఇస్తానని చెబుతున్న మందును నమ్మవద్దని చెబుతున్నట్లే ఉంది.




అసలు నెల్లూరుకు చెందిన ఆనందయ్య విషయంలో ప్రభుత్వం ఎందుకింత కఠినంగా ఉంది ? ఎందుకంటే ఆనందయ్య మందు పేరుతో ఒక్కసారిగా పాపులరైపోయిన ఆనందయ్య తర్వాత రోజుల్లో ప్రభుత్వాన్నే ఢీ కొనేట్లుగా వ్యవహరించారు. ఆనందయ్య ఇచ్చిన మందు శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. ఎందుకంటే ఇది ఆయుర్వేద మందు ఎంతమాత్రం కాదు. ఆనందయ్య ఇచ్చేది కేవలం నాటుమందు మాత్రమే. నాటుమందు అన్నంత మాత్రాన తీసిపారేయాల్సిన అవసరం లేదు.




నాటుమందు ఇచ్చే వ్యక్తి అంకితభావం, విషయ పరిజ్ఞానం మీద మందు పనిచేసే విషయం ఆధారపడుంది. ఇపుడు ఆనందయ్య మందునే తీసుకుంటే కరోనా వైరస్ కు ఈయన దగ్గర మందు తీసుకున్న వాళ్ళకి కరోనా తగ్గిందనేందుకు రుజువులేమీ లేవు. పైగా ఆనందయ్య మందు వాడిన వాళ్ళల్లో ఇద్దరు,  ముగ్గురు చనిపోయినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఏదో కాలం కలిసోచ్చి ఆనందయ్యకు దేశవ్యాప్తంగా  బాగా పాపులారిటి వచ్చేసింది.




ఎప్పుడైతే బాగా పాపులర్ అయిపోయారో వెంటనే ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణంలోకి దిగిపోయారు. ప్రభుత్వం మీదే ఫిర్యాదులు చేశారు. కోర్టుల్లో కేసులు కూడా వేశారు. దీంతో ఆనందయ్య తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నట్లు అర్ధమైపోయింది. కొద్దిరోజుల తర్వాత తాను రాజకీయాల్లోకి వస్తున్నానని కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు కాస్త హడావుడి కూడా చేశారు. దాన్నెవరు పట్టించుకోకపోయేటప్పటికి కొంత కాలం ఎక్కడా కనబడలేదు. మళ్ళీపుడు ఒమిక్రాన్ మందంటు హడావుడి మొదలుపెట్టారు.         అయితే ప్రభుత్వ ప్రకటనతో సంబంధంలేకుండా  ఆనందయ్య ముందుకెళ్ళెట్లే  ఉన్నాడు. ఏమవుతుందో చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: