ఏదో 2014లో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి బాగోకపోవడంతో బొత్స చీపురుపల్లిలో ఓడిపోయారు గానీ..లేదంటే అప్పుడు కూడా సత్తా చాటేవారు. ఇక బొత్స లాంటి వారికి వైసీపీ లాంటి పార్టీ తోడైతే ఏం జరుగుతుందో 2019 ఎన్నికల్లో రుజువైంది. టీడీపీ నేత నాగార్జునని చిత్తుగా ఓడించారు. ఇప్పుడు జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక ఇలా బలంగా ఉన్న బొత్సకు చెక్ పెట్టడానికి నాగార్జునకు పెద్దగా అవకాశాలు దొరకడం లేదు.
పైగా రాజకీయ అనుభవం లేకపోవడం కాస్త మైనస్ అవుతుంది. అందుకే ఈ రెండున్నర ఏళ్లలో నాగార్జున పెద్దగా పుంజుకోలేకపోయారు. అయితే బొత్స లాంటి నేతకు చెక్ పెట్టాలంటే..ఆయనకు ధీటైనా నాయకుడు ఉండాలి...నాగార్జున మాత్రం బొత్సకు ధీటైన నాయకుడు ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే ఇప్పటికే చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ...పలు చోట్ల ఇంచార్జ్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చీపురుపల్లిలో కూడా మార్పులు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ఓ వర్గం చేస్తుంది.
పైగా చీపురుపల్లి సీటు కోసం సీనియర్ నేత త్రిమూర్తులు రాజు కాచుకుని కూర్చున్నారు. గత ఎన్నికల్లోనే ఈయన పోటీ చేయాలని చూశారు. కానీ బాబు అవకాశం ఇవ్వలేదు. ఈ సారి మాత్రం సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. లేదంటే చీపురుపల్లిలో కాస్త గ్రూపులు పెరిగేలా ఉన్నాయి. పైగా గద్దె బాబూరావు లాంటి సీనియర్ కూడా పార్టీని వీడారు. ఇటు త్రిమూర్తులు రాజు కూడా సహకరించకపోతే...బొత్సని ఢీకొట్టడం నాగార్జునకు సాధ్యంకాదు.