ఇలాంటి పరిణామాల నేపథ్యం లో అటు అగ్ర రాజ్యాలైన రష్యా అమెరికా మధ్య గత కొంత కాలం నుంచి వివాదం కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ విషయం లో కలగ జేసుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదని... తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేస్తూ ఉండటం గమనార్హం. అదే సమయం లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్ లో కలుపు కోవాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించింది.
ఇప్పుడు మరో సారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చిన స్టేట్మెంట్ కాస్త సంచలనం గా మారి పోయింది. ఓవైపు నాటో మరోవైపు యూరోపియన్ యూనియన్, ఇంకోవైపు అగ్ర రాజ్యమైన అమెరికా సైతం హెచ్చరికలు జారీ చేసిన అటు వెనక్కి తగ్గడం లేదు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ క్రమం లోనే ఇటీవలే ప్రెస్ మీట్ నిర్వహించిన రష్యా అధ్యక్షుడు.. సహనం కోల్పోయి మాట్లాడారు.. నాటో కెన్ గో టు హెల్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఇలాగే ముందుకు వెళ్తున్నాను.. దిక్కున్నచోట చెప్పుకోండి అన్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్.