ఈ నేపథ్యంలో కేంద్రం కూడా బూస్టర్ డోస్‌లకు మొగ్గుచూపుతోంది. ఈ మేరకు కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం 60ఏళ్ల వయసు దాటి, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని భావిస్తోంది. తద్వారా ప్రాణనష్టం తగ్గించాలన్నదే కేంద్రం ఉద్దేశం. అలాగే ఫ్రంట్ లైన్ వారియర్లకు కూడా బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. 3
అయితే.. అయితే ఈ బూస్టర్ డోస్ పై అనేక సందేహాలు ఉన్నాయి. ఈ బూస్టర్ డోస్ ఎవరు తీసుకోవాలి.. ఎప్పుడు తీసుకోవాలి.. రెండో డోస్ తీసుకున్న తర్వాత ఎన్నిరోజులకు బూస్టర్ డోస్ తీసుకోవాలి అనే సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయి. వాటికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా రెండో డోసు తీసుకున్న 9 నుంచి 12 నెలలు మధ్యకాలంలో ఈ బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిదని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
బూస్టర్ డోస్ విషయంలో.. మరింత స్పష్టత రావడానికి కాస్త సమయం పట్టొచ్చు.. రెండో డోసు, బూస్టర్ డోసు మధ్య 9 నుంచి 12 నెలల వ్యవధి ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ అంశంపై కేంద్రం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఇదే అంశంపై ఇమ్యూనైజేషన్ విభాగం, ఇమ్యూనైజేషన్‌పై జాతీయ సాంకేతిక సలహాబృందం కొన్ని రోజులుగా చర్చిస్తున్నాయి.