చరిత్ర ఎప్పుడూ చెరగి పోదు. భారత్ లోను, రాష్ట్రం లోనూ 2021 లో జరిగిన రాజకీయ విశేషాలను ఒక్క సారి గుర్తు చేసుకుంటే  తీపి గురుతుల కన్నాచేదు జ్ఞాపకాలనే ఎక్కున మిగిల్చి వేళ్లిపోతోంది. పోతో పోనివ్వండి అని మనం అనే లోపే ఈ ఏడాది ముందుకు సాగిపోనుంది.


రాజకీయ పార్టీలకు ఇది అణచి వేతల సంవత్సరం. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు,  నేతలు గతంలో ఎన్నడూ లేనంతా అణచి వేతకు గురయ్యారు. ఇందుకు కారణం... అందరికీ తెలిసిందే. రాజ్యం చేసిన అరాచకం... మరో మాటగా చెప్పాలంటే అధికార మత్తులో పాలకులు ఆడిన  పైశాచిక క్రీడ.  దేశంలో  దామోదర్ దాస్ నరేంద్ర మోడీ, అమిత్ షాల ద్వయం. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి లు చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం, ధర్మం అన్నట్లుగా వ్యవహరించారు. ఇది ఎవరూ కాదన లేని సత్యం.


దశాబ్దాల తరబడి పైసాకు పైసా కూడబెట్టుకున్న నగదుతో కొనుక్కున్న ఇల్లు మొదలుకొని,  ఇటిక ఇటిక పేర్చి నిర్మించుకున్న కర్మాగారం కానీ  ఏ బడాబూాబులో రాత్రికి రాత్రే ఆక్రమించుకుంటే ఇది ఏమిటని అడగ లేని స్థితిలో నేడు ప్రజలున్నారు. ఈ దురవస్థకి కారణం పాలకులే అని వేరే చెప్పక్కర లేదు. రాష్ట్రంలో అమరావతి రైతుల ఉద్యం నుంచి ఢిల్లీలో పంజాబ్ రైతుల ఉద్యమం వరకూ  ప్రజల గొంతుకల్ని పాలకులు ఉక్కు పాదంతో నోప్పి పారేశారు. ఇదే మని ప్రశ్నించాల్సిన మీడియా జనం కూడా మిన్నకుండి పోయారు. కారణం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే  వారి ఆర్థిక మూలాల మీద దెబ్బపడుతుంది. అంతే కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే  దేశద్రోహం లాంటి కేసులు నమోదవుతాయి.  శ్రీకృష్ణ జన్మస్థానం అనబడే జైల్లో పెట్టి చిత్రవధ చేస్తారు. అందుకు దిశ రవి ఉందతం ఓ ఉదాహరణ మాత్రమే. అంతే కాదు రాష్ట్రంలో వై.ఎస్.ఆర్.  కాంగ్రెస్ పార్టీ  ఝండా పై గెలిచి, ఆ పార్టీలో అసమ్మతి నేతగా నెట్టుకు వస్తున్న రఘరామ కృష్ణం రాజు  ఎదుర్కోన్న పరిస్థితిని ఇంకా జనం మర్చి పోలేదు. ఆయన చేసి వ్యాఖ్యులు, ప్రతిగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు కాసేపు పక్కన పెడదాం. పాలకులు సృష్టించిన భయానక వాతావరణాన్ని మాత్రం మనం ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం. ప్రభుత్వాన్ని ధిక్కరిస్తే బతకలేరు అన్నభయానక వాతావరణాన్ని సృష్టించారు పాలకులు. తామే రాజులుగా, చక్రవర్తులుగా భావించుకుంటున్నారు.తాము ఉన్నది ప్రజాస్వామ్యంలో అన్న విషయం మరచిపోయినట్లున్నారు మన పాలకులు.  ఇది ఎంత వరకూ సమంజసం.... వారి విజ్ఞతకే వదిలేద్దామా ? ప్రశ్నించి పరాభవం ఎదుర్కోందామా ?


మరింత సమాచారం తెలుసుకోండి: