స్వచ్ఛందంగా థియేటర్ యాజమాన్యాలే కొన్ని సినిమా హాళ్లను మూసివేసుకున్నాయి. ఉదాహరణకు బాహుబలి థియేటర్ అయిన సూళ్లురుపేటలో ఉన్న థియేటర్ యాజమాన్యం అదే కొనసాగించారు. తాజా ధరల ప్రకారం థియేటర్ నడిపించాలంటే కరెంట్.. ఖర్చు కూడా రాదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కొందరు కోర్టును ఆశ్రయించం.. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు జీవో 35ను రద్దు చేసినది. దీంతో టికెట్ల రేట్లు పెరిగే అవకాశం వస్తుందనుకుంటే.. ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. ఈ వ్యహారం ప్రస్తుతం విచారణ దశలో ఉన్నది. ఈ లోపు ప్రభుత్వం సినిమా హాళ్లపై తనిఖీలు చేస్తుండడం.. మూతపడుతుండడంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్సటి వరకు టికెట్ల అంశంలో వెనక్కు తగ్గేదే లే అన్నట్టు ఉన్న ప్రభుత్వం.. అనూహ్యంగా సంచలన నిర్ణయమే తీసుకున్నది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఓ మెట్టు దిగిందా ప్రభుత్వం అనే ప్రచారం ప్రారంభమైంది. అయితే ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారాన్ని పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. థియేటర్లలో సినిమా ధరలు భారీగా తగ్గిస్తూ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై దిద్దుబాటుకు నడుం బిగించిందని ప్రచారం కొనసాగుతుంది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ నేతృత్వంలో 11 మందితో ఈ కమిటీనీ ఏర్పాటు చేసినది. కోర్టులో పిటిషన్లు, సినీ పరిశ్రమ ఇబ్బందులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించి.. ఈ కమిటీ సమస్య పరిష్కారాన్ని సూచిస్తుందంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. దీనిపై నిన్న సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ సీఎంకు ఎలాంటి నివేదిక ఇస్తుందో వేచి చూడాలి మరీ.