సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూ ఇతర దేశ ఆర్మీని భయపెడుతూ కొన్ని దేశాలానే స్వాధీనం చేసుకుంటు ఉంటే ఇక మరికొన్ని సార్లు ఆర్థిక సహాయం పేరుతో ఎన్నో దేశాలకు అప్పులు ఇచ్చి తర్వాత తీర్చ లేకుండా ఉన్న సమయంలో ఇక ఇతర దేశాలలో భూభాగాలను స్వాధీనం చేసుకొని సైనిక స్థావరాల ఏర్పాటు చేసుకోవడం లాంటివి కూడా చేస్తుంది చైనా. ఇక పొరుగున ఉన్న ఎన్నో చిన్న దేశాలను చైనాలో కలుపుకోవడానికి సామ్రాజ్యవాద ధోరణితో ముందుకు సాగుతోంది. ఇలా గత కొంతకాలం నుంచి చైనా వ్యవహరిస్తున్న తీరు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి పోతుంది అని చెప్పాలి. ఇలా విస్తరణ ధోరణితోనే చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలతో కూడా వివాదం పెట్టుకుంది చైనా.
ప్రపంచ దేశాలపై ఆధిపత్యం సాధించేందుకు ఎన్నో కుట్రలు పన్నుతోంది చైనా. ఇప్పటికే హాంకాంగ్, టిబెట్ లాంటి దేశాలను చైనాలో కలుపుకుంది. ఈ క్రమంలో చైనా విస్తరణ వాద ధోరణిపై ప్రపంచ దేశాలు యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఇటీవల కెనేడా పిలుపునిచ్చింది. కెనడా ప్రధాని ఇటీవల దీనికి సంబంధించి స్టేట్మెంట్ విడుదల చేశారు. చైనా ఆక్రమణలను చొరబాట్లకు చెక్ పెట్టేందుకు అన్ని దేశాలు కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని. లేదంటే రానున్న రోజుల్లో పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది అంటూ కెనడా ప్రధాని పిలుపునిచ్చారు. మరీ దీనిపై ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయి అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.