తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి...మొన్నటివరకు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదనే పరిస్తితి. కానీ ఎప్పుడైతే దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ని బీజేపీ ఓడించిందో అప్పటినుంచి సీన్ రివర్స్ అయింది. టీఆర్ఎస్‌కు గడ్డుకాలం మొదలైంది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీయడం మొదలయ్యాయి. ఆ తర్వాత జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం, ఇక హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ని మట్టి కరిపించడంతో బీజేపీ అనూహ్యంగా రేసులోకి వచ్చింది. నెక్స్ట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టి ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది.

అటు పి‌సి‌సి పగ్గాలు చేపట్టాక రేవంత్ రెడ్డి సైతం దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ని రేసులోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎలాగో కాంగ్రెస్‌కు క్షేత్ర స్థాయిలో బలం ఉంది కాబట్టి...ఆ బలాన్ని మరింత పెంచుకుని, నెక్స్ట్ ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఇటు అధికార టీఆర్ఎస్ సైతం ప్రతిపక్షాలకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వకుండా మూడోసారి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంది.

అంటే తెలంగాణలో ట్రైయాంగిల్ ఫైట్ జరుగుతుందనే చెప్పొచ్చు. అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలని బట్టి చూస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇప్పుడే చెప్పలేని పరిస్తితి. ఈ పోటాపోటి వాతావరణంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి..అప్పటికి ఏం అవుతుందో తెలియని పరిస్తితి.

కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాదని, హాంగ్ దిశగా తెలంగాణ రాజకీయాలు ముందుకెళుతున్నాయని, ప్రస్తుతం ఎలాగో టీఆర్ఎస్‌పై వ్యతిరేకత ఉంది. అలా అని బీజేపీకి పూర్తి స్థాయి బలం లేదు. అటు కాంగ్రెస్‌ది కూడా అదే పరిస్తితి. దీని బట్టి చూసుకుంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇప్పుడే చెప్పలేని పరిస్తితి. మొత్తానికైతే తెలంగాణ రాజకీయాలు హాంగ్ దిశగా వెళుతున్నట్లు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: