ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పై ఒక అపవాదు ఇప్పటికీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వరుసవెంబడి అమలు చేస్తుందనేది ఆ విమర్శ. . ఏపి ప్రభుత్వం తాజాగా తెలంగాణ పాలకులు పాడిన పాటనే పాడేందుకు సమాయత్తం అయ్యారు. అది సరికొత్త పల్లవితో...మీరూ ఓ లుక్ వేయండి
అవును.. ఇది నిజం... తెలంగాణ రాష్ట్రం ఆచరించాలని తలస్తున్న పథకాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అచరణలో పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లో వరిసాగు రైతుల జీవనాధానం. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అధికారులు ఎప్పటి నుంచో సూచించినా  రైతులు మాత్రం ఆదిశగా పయనం సాగించేందుకు విముఖత ప్రదర్శించారు. వారి కారణాలు వారివి. పుడమిని నమ్మకుని సేద్యం చేసే రైతులు ఇప్పటికి కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  వారి ఆశ, శ్వాస అంతా కూడా వ్యవసాయమే. ఇక అసలు విషయానికి వద్దాం.  ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం  ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధానంగా సేద్యం చెఱువులు, బావుల క్రింద జరుగుతుంది. మరో కోంత  వర్షాధారంగా జరుగుతుంది.  అధికారిక గణాంగాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో పాతిక లక్షల ఎకరాల ఆయకట్టు భూమి బోర్ల క్రింద జరుగుతుంది. రైతులు దాదాపు 12 లక్షల బోర్లు వేసుకుని ఉన్నారని ప్రభుత్వ లెఖ్ఖలు చెబుతున్నాయి. ఈ సేద్యం వ్యయ ప్రయాసలతో కూడినది కావడంతో రైతులను క్రమంగా పంట మార్పిడి పై దృష్టి సారించేలా ప్రభుత్వం ప్రణాళికులు సిద్ధిం చేసినట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి వరిసాగునే నమ్మకుని జీవనం సాగిస్తున్న రైతులను క్రమంగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలే అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఒక్క సారిగా వరిసాగు వద్దంటే రైతుల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచన మేరకు దశల వారీగా... ఇంకా చెప్పాలంటే ప్రాంతాల వారీగా రైతులను చైతన్యవంతం చేసి ఆరుతడి పంటలు సాగు చేసేలా సమాయత్తం చేయనున్నారు. వారి సాధించిన ఫలితాలను ఆంధ్ర ప్రదేశ్ లోని ఇతర ప్రాంత రైతలకూ చూపించి మిగిలిన రైతులను కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా కేంద్రాలు,  గ్రామల్లోని వాలంటీర్ల వ్యవస్థకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రచారం కల్పించే బాధ్యతను అప్పగించనున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో వరిసాగు వేయవద్దని ముఖ్యమంత్రి ప్రకటించడం, ఆపై రాజకీయంగా పెద్ద దుమారం రేగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వ ప్రత్యామ్నాయ సాగు పై ఆచితూచి అడుగులేస్తోంది.  వ్యవసాయ శాఖ పటిష్టమైన ప్రణాళిక తో ముందుకు సాగనుంది.  వాహ్..వా .. ఆంధ్రలో  తెలంగాణ ట్యూన్  హిట్ అవుతుందా ? వేచి చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: