మన దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయనీ.. ఇది థర్డ్ వేవ్ కు సంకేతం అని పబ్లిక్ హెల్త్ డైెరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరుగుతాయన్నారు. అలాగే ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. అయితే ఒమిక్రాన్ పట్ల భయపడాల్సిన పనిలేదనీ.. వైద్యశాఖ సన్నద్ధంగా ఉందన్నారు. న్యూ ఇయర్, సంక్రాంతి దృష్ట్యా వచ్చే రెండు వారాల నుంచి నాలుగు వారాలు అత్యంత కీలకమని హెచ్చరించారు.

ఒమిక్రాన్ సోకిన వారిలో దాదాపు 90శాతం మందిలో లక్షణాలు లేవని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్ నుంచి రక్షించుకోవచ్చని.. అలాగే మాస్కులు ధరించాలన్నారు. భౌతిక దూరం పాటించాలని కోరారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో బెడ్ల అవసరం ఉంటుందన్నారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వైద్యశాఖ సిద్ధంగా ఉందని.. ఆందోళన అవసరం లేదని చెప్పారు.

కరోనా థర్డ్ వేవ్ పై తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి తర్వాత థర్డ్ వేవ్ ప్రారంభానికి అవకాశముందన్నారు. ఒమిక్రాన్ వేగంగా సామాజిక వ్యాప్తి చెందుతోందని.. డెల్టా కంటే 30రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. థర్డ్ వేవ్ తో కరోనా పూర్తిగా అంతమయ్యే సూచనలున్నాయన్నారు. మరో ఆరు నెలల్లో కోవిడ్ ప్రభావం ఉండదని అభిప్రాయపడ్డారు.

మరోవైపు మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 198ఒమిక్రాన్ కేసులు రాగా.. మొత్తం కేసుల సంఖ్య 450కి చేరింది. అటు నైజీరియా నుంచి మహారాష్ట్రలోని పింప్రీ చించ్ వాడ్ కు వచ్చిన ఓ వ్యక్తి రెండు రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. అయితే తాజా రిపోర్టులో అతడికి కూడా ఒమిక్రాన్ ఉన్నట్టు తేలింది. అయితే అతడు కరోనాయేతర కారణాలతో చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. మొత్తానికి థర్డ్ వేవ్ ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.







మరింత సమాచారం తెలుసుకోండి: