2021 వెళ్లిపోయింది.. 2022 వచ్చేసింది.. అయితే..  2021 వెళ్తూ వెళ్తూ ఓ చేదు నిజం చెప్పేసి వెళ్లింది.. ఓ హెచ్చరిక చేసేసి వెళ్లిపోయింది. ఇకైనానా మేలుకోమని చెప్పి వెళ్లింది. ఇప్పటికైనా జాగ్రత్తపడకపోతే ముందు ముందు మీ ఉనికికే ప్రమాదం సుమా అని చెప్పేసి వెళ్లిపోయింది. మరి 2021 చెప్పిన ఆ చేదు నిజం ఏంటి.. మానవాళికి వచ్చిన ముప్పు ఏంటి.. తెలుసుకుందామా..?


ఇంతకీ ఆ చేదు నిజం ఏంటి తెలుసా.. మనిషిలో ప్రత్యేకించి మగాళ్లలో ప్రత్యుత్పత్తి సామర్థ్యం క్రమేపీ తగ్గిపోతోందట. ఆధునిక జీవనంలో అనేక రకాల ఒత్తిళ్ల కారణంగా మానవ పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోందట. ఆ తగ్గడం కూడా ఏదో కాస్తో కూస్తో కాదట.. గణనీయంగా తగ్గిపోతోందట. మరి ఈ విషయం ఎలా వెలుగు చూసిందంటారా.. ప్రపంచ పెద్దన్న అగ్ర రాజ్యం అయిన అమెరికా జనాభా లెక్కల కోసం ఓ బ్యూరోని ఏర్పాటు చేసింది. ఈ అమెరికా సెన్సెస్ బ్యూరో ఏటా ప్రపంచ జనాభాపై అంచనాలు రూపొందిస్తుంటుంది.


ఈ సంస్థ అధ్యయనంలో 2021లో ప్రపంచ జనాభా భారీగానే పెరిగినట్లు తెలిందట. 2022 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా 780కోట్లుగా ఉంటుందని ఈ అమెరికా సెన్సస్ బ్యూరో చెబుతోంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ 31 మధ్య ప్రపంచ జనాభా ఏడున్నర కోట్లు పెరిగిందట. ఇంకా సగటున చెప్పాలంటే.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలో ప్రతి సెకనుకు 4.3 మంది పుట్టారట. అలాగే ప్రతి సెకనుకు ఇద్దరు మరణించారట. అందుకే ప్రపంచ జనాభా ఏడున్నర కోట్లకు పెరిగిందన్నమాట.


అయితే ఈ పెరుగుదల బాగానే పైకి కనిపిస్తున్నా..ఇది వాస్తవంగా ఉండాల్సినంత ఉండటం లేదట. ఈ రేటు కారణంగా ముందు ముందు భూమిపై జనాభా తగ్గే ప్రమాదం కూడా ఉందట. ఈ శతాబ్దపు ప్రపంచ జనాభా 2064లో అత్యధికంగా ఉంటుందట. ఆ తర్వాత నుంచి తగ్గడం మొదలవుతుందట. అలా శతాబ్దం చివరి నాటికి జనాభాలో 50% తగ్గుదల కనిపిస్తుందట. మనిషిపై పెరుగుతున్న ఒత్తిళ్లే ఈ తగ్గుదలకు కారణమట.


మరింత సమాచారం తెలుసుకోండి: