బంగారం లాంటి గనులు రోజూ
నిజం అయ్యేందుకు
ముందున్న కాలం జగన్ సర్కారుకు
సహకారం అందించనుంది.
ఈ కథ ఇప్పుడే మొదలైంది
1500 ఎకరాల్లో భూమి నిర్థారణ అయింది
తవ్వితే దొరికితే సీమ వాకిట బంగారమే
బంగారు పంటలు పండినా పండకున్నా
బంగారం లభ్యత మాత్రం త్వరలోనే షురూ కానుంది.
మైనింగ్ ప్రాసెస్ కు సంబంధించి రాజశేఖర్ రెడ్డి హయాంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. అయితే అవన్నీవివాదాలను దాటుకుని ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేకపోతున్నాయి. అక్రమాల్లో ఆ రోజు సీఎం హోదాలో రాజశేఖర్ రెడ్డికి కూడా వాటాలున్నాయని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మరో మైనింగ్ కేసు నమోదు కానుంది. కర్నూలు కేంద్రం గామొదలయ్యే ఆ కేసుకు ఏపీ ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏంటో చూద్దాం.
ఉమ్మడి ఆంధ్రాలో బయ్యారం లో ఇనుప ఖనిజం తవ్వకంపై అనేక వివాదాలు రేగాయి. రెండు మూడు ప్రభుత్వాలు మారినా కూడా వివాదం కొనసాగింది. అప్పట్లో టీఆర్ఎస్ ఎంతో యాక్టివ్ గా ఉండి దీనిపై మాట్లాడిందని కూడా వార్తలున్నాయి. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కూడా ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది. కానీ అది ఇప్పటికీ కొలిక్కిరాలేదు. బయ్యారంలో ఇనుప ఖనిజం తవ్వకంపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి..అప్పట్లో బయ్యారం గూబ గుయ్యారం అంటూ మీడియాలో ఓ టైటిల్ తెగ రొటేట్ అయ్యేది. కాల గతిలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైనప్పటికీ బయ్యారానికి సంబంధించిన సమస్య మాత్రం ఆ విధంగానే ఉంది. ఇప్పుడు ఆంధ్రాలో మరో వివాదం రేగనుంది. ఆ రోజు వైఎస్సార్ హయాంలో బయ్యారం గనుల కేటాయింపుపై ఎలాంటి వివాదం రేగిందో మరువక మునుపే కర్నూలులో బంగారం గనుల తవ్వకంపై ఏపీ సర్కారు దృష్టి సారిస్తోంది.
కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం,పగిడిరాయి,జొన్నగిరి గ్రామాలలో బంగారు గనుల తవ్వకాల కోసం జియో మైసూరు సంస్థ చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేలానే ఉన్నాయి. ఇందుకు సంబంధించి తవ్వకాలు కూడా మొదలయ్యాయని ప్రధాన మీడియా
స్పష్టం చేసింది. ముడిఖనిజం కు సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్ కూడా నెలకొల్పారని ఆధారాలతో సహా వెలువరించింది ఓ వార్త. మరి! బంగారు నిక్షేపాలను జగన్ సర్ వద్దనుకుంటారో లేదా ప్రయివేటు సంస్థ తవ్వుకుని నామమాత్రపు ధర ఇచ్చి ఖనిజం ఎత్తుకుపోతే చూస్తూ ఊరుకుంటారో తేలాలిక.