తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేటి రాత్రి 7.30 గంటలకు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘జాగరణ’ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  317 జీవోను సవరించాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంఘీభావంగా బండి సంజయ్ ‘జాగరణ’  ప్రారంభం చేయనున్నారు.  నేటి రాత్రి 7.30 గంటల నుండి రేపు తెల్లవారుజాము వరకు ‘జాగరణ దీక్ష కొనసాగనుంది. బండి సంజయ్ ‘జాగరణ’కు మద్దతు తెలిపేందుకు వివిధ జిల్లాల నుండి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు తరలి వెళ్లనున్నారు.  317 జీవో ఉద్యోగుల ‘స్థానికత’కు పెను ప్రమాదమని ఈ సందర్భంగా  శాసన మండలి మాజీ ఛైర్మన్, భారతీయ జనతా పార్టీ నేత  స్వామి గౌడ్ ప్రకటన చేశారు. 

317 జీవోను సవరించాలని కోరుతూ బండి సంజయ్ చేపడుతున్న ‘జాగరణ’ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు స్వామిగౌడ్ పిలుపు ఇచ్చారు.  బండి సంజయ్ ‘జాగరణ’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలని అటు  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.  ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వ మూ మనుగడ సాధించలే దని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు  టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్.విఠల్.  బండి సంజయ్ ‘జాగరణ’ కార్యక్రమానికి సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీస్ సంఘాలన్నీ తరలిరావాలన్నారు  టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్. విఠల్.  తక్షణమే ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సమావేశమై 317 జీవోను సవరించాలని డిమాండ్ చేశారు పీఆర్టీయూ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్ రెడ్డి. కెసిఆర్ సర్కార్ దిగివచ్చేవారకు తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యోగుల పట్ల దా రుణం గా వ్యవ హారి స్తున్నట్లు మండి పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: