ఇపుడిదే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా జరుగుతోంది. కాపుల కోసం కొత్త రాజకీయపార్టీ పెట్టాలనే డిమాండ్లు బలంగా వినబడుతున్నాయి. ఇపుడున్న పార్టీల్లో ప్రత్యేకంగా కాపులకు అంత ప్రాధాన్యత ఉండటం లేదంటు కొందరు గోల గోల చేస్తున్నారు. అయితే కాపు సామాజికవర్గంలోని ప్రముఖుల ఆలోచన ప్రకారం కాపుల కోసమంటు కొత్తగా పార్టీ పెట్టేంత సీన్ ఎవరికీ లేదట. ఇప్పటికే పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఉంది కాబట్టి కాపులకు మరో పార్టీ అవసరం కూడా లేదని అనుకుంటున్నారు.




ఇపుడు కాపుల్లో ప్రముఖులుగా చెలామణి అవుతున్న వారిలో ఎవరికి కూడా కొత్త రాజకీయ పార్టీని పెట్టే ఆలోచన లేదని తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ పెట్టడమంటే ఏదో మీడియా సమావేశంలో ప్రకటించటమే లేకపోతే కాగితాల మీద యాక్షన్ ప్లాన్ రాయటమో కాదు. పార్టీ నిర్వహణ కోసం కోట్లరూపాయలు ఖర్చుచేయాలి. రాష్ట్రం నలుమూలలా పర్యటించాలి. అన్నీ వర్గాలను ఆకట్టుకోవాలి. రాజకీయమే సర్వస్వంగా బతకాలి. ఇంతచేసినా జనాలు ఆదరిస్తారనే నమ్మకంలేదు. ఇలాంటి నేపధ్యంలో కాపుల్లో కొత్తగా రాజకీయపార్టీ పెట్టేంత సీన్ ఎవరికీ లేదట.




ఏడేళ్ళ క్రితం పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ పరిస్ధితి ఏమిటో అందరు చూస్తున్నదే. కాపుల్లో పవన్ కన్నా మొనగాడు ఎవరున్నారు ?  నిఖార్సయిన రాజకీయాలు చేయటం, పార్టీని గెలిపించటం పవన్ వల్ల కాలేదన్న విషయమై కాపుల్లోనే పెద్ద చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో కాపుల కోసం కొత్త రాజకీయపార్టీ పెట్టడం సాధ్యం కాదనే అంటున్నారు. కొత్తపార్టీ పెట్టడం కన్నా తామున్న పార్టీల్లోనే కాపుల ప్రాతినిధ్యం కోసం ప్రయత్నాలు చేసుకోవటమే ఉత్తమం అని కూడా చాలామంది కాపు ప్రముఖులు భావిస్తున్నారు.




కాపు ప్రముఖుల్లో ముద్రగడ పద్మనాభం, వంగవీటి రంగా, గంటా శ్రీనివాస్ లాంటి వాళ్ళకు కూడా కొత్తపార్టీ పెట్టేయోచన లేదని సమాచారం. ఎందుకంటే పార్టీ పెట్టి జనాలను మెప్పించటం అంత తేలిక్కాదని వాళ్ళకు ఇప్పటికే అర్ధమైపోయింది. పైగా పవన్ రూపంలో లైవ్ ఎగ్జాంపుల్ చూస్తు కూడా మళ్ళీ కొత్తపార్టీ అంటే అయ్యేపని కాదని అందరికీ అర్ధమైపోయిందట. సో హోలు మొత్తం మీద చూసుకుంటే ప్రత్యేకంగా కాపుల కోసమే ఒక రాజకీయపార్టీ అనేది సాధ్యం కాదని కాపు ప్రముఖులే తేల్చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: