
ప్రభుత్వం తీసుకు వచ్చిన నిభంధనలు ఇవే..
తినే వస్తువులు,మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింకులు నిర్ణీత ధరలకే విక్రయించాలి. విడిగా అమ్మే తినుబండారాలు అందించే కంటైనర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతో పాటు ఎ మ్మార్పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్ ఉండాలి. ప్రస్తుతం ఉన్న ధరలను బోర్డులో ఉంచాలి.ధర మారితే ఎప్ప టికప్పుడు మార్పులు, చేర్పులు చేయాలి.
ప్యాకేజ్డ్ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు, ఎమ్మార్పీ, కస్టమర్ కేర్ వివరాలు ఉంచాలి. ఎమ్మార్పీ రేటు ఉన్న వాటిని మాత్రమే ప్రజలకు అమ్మాలి. అలా లేని వాటిని అమ్మరాదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు.. ఒకవేళ ఎక్కువ ధరలకి విక్రయిస్తె జనాలు ఫిర్యాదులు ఇచ్చిన వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అవి అలా కేసులకే పరిమితం అవుతూన్నాయి...