ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు వేల పేజీల చార్జిషీట్. సాధారణంగా ఒక కేసు కు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్ తరువాత పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయడం రివాజు. న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత కూడా మరాల మరలా సప్లిమెంటరీ చార్జీషీట్ లు దాఖలు చేస్తారు. ఈ కేసులో పోలీసులు తొలి విడుత లోనే ఏకంగా ఐద వేల పేజీల చార్జీషీట్ ను దాఖలు చేశారు. ఇంతకీ ఈ కేసు ఏంటో తెలుసా ?

ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న వేళ జరిగిన సంఘటన ఇది.  కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా కర్షకులు దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న సమయం కూడా ఇదే. ఉత్తర ప్రదేశ్ లోని లఖింపుర్ ఖేేరీ వద్ద నిరస చేస్తున్న రైతుల పైకి కారు దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అశువులు బాసారు. ఆ తరువాత జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిత్రా ఉద్దేశపూర్వకంగా వాహనం నడిపి రైతుల మృతి కారణమయ్యారని  నాడు సామాజిక మాధ్యమాల్లో  వీడియోలు హల్ చల్ చేశాయి. ప్రతిపక్ష నేతలు బాధితులను పరామర్శించేందుకు బారులు తీరారు. ఈ కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు వారం పదిరోజుల తరువాత ఆశిష్ తో సహా మరో పదమూడు మంది పై కేసు నమోదు చేశారు. అది కూడా కోర్టులు, ప్రతిపక్షాలు ఒత్తిడి తేవడంతో. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీయడంతో ఈ కేసులో కొంత పురోగతి ఏర్పడింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఘటన ను విచారణ చేసేందుకు ఒక సిట్ ను ఏర్పాటు చేసింది. ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఇది రాజకీయ కుట్ర అని పేర్కోంటోంది. తన కుమారుడు నిర్దోషి  అని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా  ఇప్పటికీ పేర్కోంటున్నారు. తన కుమారుడ్ని నిందితుడిగా చూపడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయన్నది  కేంద్ర మంత్రి ఆరోపణ. తాజాగా లఖింపుర్ ఖేరీ కేసుకు సంబంధించి పోలీసులు ఐదు వేల పేజీల చార్జీషీట్ దాఖలు చేశారు. అన్ని పేజీలు పూర్తిగా చదివే టప్పటికే సగం పుణ్యకాలం కాస్తా అయిపోతుందిగా !

మరింత సమాచారం తెలుసుకోండి: