ఎస్సీ నియోజకవర్గం అయిన పాయకరావుపేటలో విజయం సాధించాలంటే మరో బలమైన సామాజిక వర్గం అండదండలు తప్పకుండా ఉండాలి. అయితే ఇప్పుడు వారి నుంచి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పైగా బాబురావు 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలిచారు. వైఎస్సార్ మరణానంతరం ఆ ఫ్యామిలీ అంటే నడిచిన బాబురావు తన ఎమ్మెల్యే పదవి ని సైతం వదులుకొని వైసీపీ లోకి వచ్చి గెలిచారు.
అయితే ఇప్పుడు సొంత పార్టీ నేతలకు కూడా ఆయన వల్ల తమకు ఉపయోగం లేదని... వచ్చే ఎన్నికల్లో బాబురావు కు సీటు ఇస్తే తాము గెలిపించమని చెపుతున్నారు. అసలు దీని వెనుక ఏం జరుగుతోంది ? అన్నది అర్థం కావడం లేదు. ఇప్పటివరకు మంచి పేరు తెచ్చుకున్న బాబురావు ఇప్పుడు సడన్ గా సొంత పార్టీ క్యాడర్ నుంచి ఇలాంటి వ్యతిరేకత ఎదుర్కోవటం సొంత పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీని వెనుక ఎవరైనా ఉన్నారా అన్న ? సందేహాలు కూడా కలుగుతున్నాయి. మరి ఈ వ్యతిరేకత నుంచి బాబురావు ఎలా బయట పడతారో చూడాలి.