చంద్రబాబునాయుడు ఎప్పుడు మీడియా సమావేశం పెట్టినా జనాలను కోరేదేమంటే ప్రభుత్వంపై తిరగబడమని. ఇపుడు జనాలతో పాటు ఉద్యోగులను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయమంటున్నారు. ప్రజల్లో చైతన్యం రావాలని పదే పదే పిలుపిస్తున్నారు. తాజాగా జరిగిన మీడియా సమావేశంలోనే కాదు దాదపు రెండున్నర ఏళ్ళుగా చంద్రబాబు ఇలాగే మాట్లాడుతున్నారు. అర్జంటుగా జగన్ను దింపేసి తాను సీఎం అవ్వాలనేది చంద్రబాబు ఆతృత. అందుకనే ఇలాంటి పిలుపిస్తున్నది. అయినా జనాలు, ఉద్యోగులు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మాటలు ఎందుకు వినటంలేదు ?




ఎందుకంటే 2014-19 మధ్య చంద్రబాబు పరిపాలన ఎలాగుందో అందరికీ తెలుసు కాబట్టే. చంద్రబాబు పరిపాలనను ఇప్పటి జగన్మోహన్ రెడ్డి పాలనతో జనాలు పోల్చి చూసుకుంటున్నారు. అందుకనే చంద్రబాబు ఎంతగా మొత్తుకుంటున్నా జనాలెవరు పెద్దగా స్పందించటంలేదు. ఇపుడు జగన్ ప్రభుత్వం ఏ ఏ రంగాల్లో ఫెయిలైందని చంద్రబాబు అండ్ కో ఆరోపిస్తున్నారో చంద్రబాబు హయాంలో కూడా అవే ఫెయిల్యూర్లున్నాయి.




అయితే తన హయాంలోని ఫెయిల్యూర్లను ఎల్లోమీడియా బయటపడకుండా కప్పిపెట్టింది. ఎల్లోమీడియా చెప్పనంత మాత్రాన జనాలకు తెలీకుండానే ఉంటుందా. ఇపుడు మెయిన్ మీడియా కన్నా సోషల్ మీడియా చాలా పవర్ ఫుల్లయిపోయింది. అందుకనే చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులను ఎల్లోమీడియా బయటపెట్టకపోయినా సోషల్ మీడియా బయటపెట్టేసింది. కాబట్టే జనాలకు చంద్రబాబు పాలన గురించి పూర్తి క్లారిటి ఉంది. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి.




చంద్రబాబు పాలన కన్నా జగన్ పాలన బాగానే ఉందని అనుకుంటే జనాలు వైసీపీకే మళ్ళీ ఓట్లేస్తారు. ఒకవేళ ఇద్దరికీ తేడా ఏమీ లేదనుకుంటే అప్పటి అవకాశాన్ని బట్టి ప్రత్యామ్నాయం చూసుకుంటారు. చంద్రబాబు పిలుపిచ్చారని జనాలు ఎవరిపైనా రెచ్చిపోరు. తాము చేయాల్సిందేదో ఎన్నికల సమయంలో చేస్తారు. మొన్నటి స్ధానికసంస్ధల ఎన్నికల్లో జనాలు చేసిందదే. తానెంత చెబుతున్నా జనాలు నమ్మటం లేదన్నదే చంద్రబాబు బాధ.




ప్రభుత్వంపై చంద్రబాబుకో లేకపోతే ఎల్లోమీడియాకో బాధుంటే జనాలకు ఏమి సంబంధం. తమకు మండినపుడే ప్రభుత్వంపైన జనాలు తిరగబడతారు. ప్రజలకు మండేవరకు చంద్రబాబు వెయిట్ చేయాలి. అయితే అంత ఓపిక చంద్రబాబులో లేదు. అందుకనే ప్రభుత్వంపై తిరగబడమని జనాలను పదే పదే రెచ్చగొడుతున్నారు. ఇపుడు జరిగింది కూడా అదే. కానీ జనాల్లో స్పందన కనబడటంలేదు. చంద్రబాబు ఆవేదనను జనాలు ఎప్పటికి అర్ధం చేసుకుంటారో ఏమో.


మరింత సమాచారం తెలుసుకోండి: