ఎవరికీ రాకూడని కష్టం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చింది. గడచిన 30 ఏళ్ళుగా తన నియోజకవర్గంలో ఎదురే లేదన్నట్లుగా జరిగిన వ్యవహారాలన్నీ ఒక్కసారిగా రివర్సవుతుండటంతో ఏమి చేయాలో అర్ధం కావటంలేదు. అందుకనే పరిస్ధితిని చక్కదిద్దేందుకు, పగ్గాలు చేయిదాటిపోకుండా ఉండేందుకు నానా అవస్తలు పడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కుప్పంలో మూడురోజుల పర్యటన పెట్టుకున్నారు.
1989లో కుప్పం నుండి మొదటిసారి గెలిచిన దగ్గర నుండి 2019 ఎన్నికల వరకు చంద్రబాబు నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది పెద్దగా లేదనే చెప్పాలి. మామూలుగా ఎంఎల్ఏగా గెలిచిన వారుకూడా తమ నియోజకవర్గాన్ని ఏదోరూపంలో డెవలప్ చేయాలని ప్రయత్నిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం ఏకంగా 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా నియోజకవర్గాన్ని చేయాల్సినంతగా డెవలప్ చేయలేదన్నది నిజం.
దాని ప్రభావం 2019లో ఓడిపోయిన దగ్గర నుండి బాగా కనబడుతోంది. వరసబెట్టి స్ధానికఎన్నికల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. దాంతో వచ్చే ఎన్నికల్లో తన గెలుపుపై టెన్షన్ మొదలైన చంద్రబాబు ఇపుడు వరసబెట్టి కుప్పంలో పర్యటిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిన దగ్గర నుండి ఇప్పటికి ఇది నాలుగో పర్యటన. అంటే మూడు నెలల్లో నాలుగుసార్లు పర్యటించిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎప్పుడూ ఇలా పర్యటించలేదు.
రాజకీయంగా చరమాంకానికి చేరుకుంటున్న దశలో చంద్రబాబుకు ఇలాంటి పరిస్ధితి రావటం స్వయంకృతమనే చెప్పాలి. కుప్పాన్ని డెవలప్ చేసుంటే ఇపుడీ దీనస్ధితి వచ్చేదికాదు. ఏళ్ళ తరబడి కేవలం నియోజకవర్గాన్ని నలుగురికి అప్పగించేశారు. దాంతో వాళ్ళు ఆడిందే ఆటగా జరిగింది. అందుకనే ద్వితీయ శ్రేణి నేతలకు, కార్యకర్తలకు చంద్రబాబుపై మండిపోయి దెబ్బకొట్టారు. ఆ దెబ్బకు చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిపోయింది.
దాంతో తత్వంబోధపడి దూరమైన వాళ్ళందరినీ మంచి చేసుకునేందుకు వరసబెట్టి పర్యటనలు చేస్తున్నారు. అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకుంటున్నారు. ఒకపుడు ఇక్కడ నాయకులు వస్తే వాళ్ళని చూడటానికి కూడా టైం లేదని పంపేసిన ఫలితమే ఇపుడు రివర్సులో కొడుతోంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో కుప్పంలో గెవలమే చంద్రబాబు ముందున్న అతిపెద్ద సవాలు. దానికే ఇన్ని అవస్తలు పడుతున్నారు. మరి చంద్రబాబు ప్రయత్నాలు సానుకూలమవుతాయా ? చూడాల్సిందే.