ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నఉత్తర భారత దేశపు ఎన్నికల నగరా మోగింది. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల కంటే కీలకమైన ఎన్నిక. కేంద్రంలో అధికారంలో ఉండే భారతీయ జనతా పార్టీకి, సూధీర్ఙ రాజకీయ చరిత గల కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు కీలకం. పేరుకు ఈ రెండు కూడా జాతీయ పార్టీలు అయినా వీటి ప్రభావం యావత్ భారత దేశం అంతటా లేదు. దక్షిణాది రాష్ట్రాలలో వీటి ఉనికి అంతంత మాత్రమే. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలదే హవా అంతా కూడా. అది వేరే విషయం, కాస్త పక్కన పెడదాం.
ప్రస్తుతం జరగనున్న తాజా ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకమైనవి. అంతేకాదు ఇది భిన్నమైన ఎన్నిక కూడా. ఎందుకో తెలుసా?
ఈ ఎన్నికల్లో గోడలు ఖరాబు చేసే రాతలుండవు. వీధుల్లో అడ్డంగా నిలిపే ప్లేక్లీలు ఉండవు. డప్పుల శబ్దాలుండవు, ఢమరుక నాదాలు వినిపించవు, శంఖం పూరించే నేతలు మనకు కనిపించరు. ఇలా రాసుకుంటూ పోతే ఎన్నికల హడావిడి అసలే ఉండదు. జనాలను ఒక చోట చేర్చి తమ పార్టీ బలం ఇదీ అనే రీతిలో సాగే రోడ్ షోలు, భారీ బహిరంగ సభలు ఉండవు. ర్యాలీలకు తావు లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇంటింటి ప్రచారం చేసుకోవాల్సిందే. అది కూడా ఐదుగురు మించి ప్రచారం లో పాల్గోన రాదు.
ఎన్నకల నియామావళి తక్షణం అమలులోకి వచ్చింది కూడా. ఇప్పటి వరకూ అధికార పదవులు అనుభవిస్తున్నవారు ఇకపై వాటికి దూరంగా ఉండాలి. విధాన పరమైన నిర్ణయాలు ఏవీ తీసుకోరాదు. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం ఏవైనా అత్యవసర నిర్ణయాలు అది కూడా అవసరమైతే తీసుకోవచ్చు. అప్పడు కూడా ఎన్నికల సంఘం అనుమతి తప్పని సరి. మంత్రులకు, ఎం.ఎల్.ఏ ల వాహనాలకు ముందు నడిచే ప్రోటోకాల్ వాహనాలుండవు, బగ్గకారు ముందు పోదు. అలసు దర్పం చూపిచడానికి ఆస్కారమే లేదు. మరో మాటలో చెప్పాలంటే సోలో గా వెళ్లాల్సిందే. మైకుల్లో ప్రచారం చేసుకోవడానికి కూడా అనుమతి లేదు. ఇలాంటి ఎన్నిక ఇప్పటి వరకూ భారత దేశ చరిత్రలో జరగ లేదు. ఇదంతా కోవిడ్-19 తీసుకువచ్చిన మార్పు అని వేరే చెప్పనక్కర లేదనుకుంటా. జనవరి 15వరకూ ఈ ఆంక్షలు అములులో ఉంటాయి. ఆ తరువాత ఎన్నికల సంఘం సమీక్షించి తగు నిర్ణయం తీసుకుంటుంది.