రాజకీయాల్లో కొత్త తరం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది..అయితే కొత్తగా వచ్చిన యువనేతలు వెంటనే సక్సెస్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే సక్సెస్ అయినా..ప్రజల మద్ధతు పొందడం అనేది అతి పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు. అలా 2019 ఎన్నికల తర్వాత రెండు విషయాల్లోనూ సక్సెస్ అయిన నేతలు కొందరు ఉన్నారు. అది కూడా వైసీపీలోనే ఎక్కువ ఉన్నారు. మామూలుగానే జగన్ యువ నేతలని ప్రోత్సహిస్తారు...2019 ఎన్నికల్లో పలువురు యువకులు సీట్లు ఇవ్వడం, వారు తొలిసారి గెలవడం జరిగాయి.

అలా తొలిసారి గెలిచి సక్సెస్ అవ్వడమే కాకుండా..ప్రజల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నేతల్లో విడదల రజిని కూడా ఒకరు. ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన రజిని...గత ఎన్నికల్లో తొలిసారి సీటు దక్కించుకోవడమే కాకుండా సీనియర్ నేత అయిన ప్రత్తిపాటి పుల్లారావుని ఓడించి చిలకలూరిపేట ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఎమ్మెల్యే అయ్యాక ఎక్కువ ప్రజల్లో ఉంటూ..వారి మద్ధతుని పొందారు. తక్కువ సమయంలోనే రజినికి ఎక్కువ క్రేజ్ వచ్చింది. సాధారణంగా ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయిలో హైలైట్ అవ్వడం చాలా కష్టం. ఏదో ఎక్కువసార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలకే అది సాధ్యమవుతుంది.

కానీ రాష్ట్ర స్థాయిలో రజినికి బాగా ఫాలోయింగ్ వచ్చింది. ఇతర జిల్లాల్లో కూడా రజిని అంటే తెలియని వారు లేరు. అలాగే ఇతర జిల్లాల్లో జరిగే వైసీపీ కార్యక్రమాలకు సైతం రజినిని ఆహ్వానిస్తున్నారు. అటు యువ నాయకుల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఎంత ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. ఎమ్మెల్యే కాకపోయినా...ఈయనకు రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇలా అనూహ్యంగా ప్రజల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ ఇద్దరు..ఒకచోట చేరడంతో వైసీపీ నేతలకు మరింత ఊపు వచ్చింది.

తాజాగా చిలకలూరిపేటలో జరిగిన ఓ క్రికెట్ టోర్నమెంట్‌కు బైరెడ్డి అతిథిగా వచ్చారు. ఇక రజిని, బైరెడ్డిలు రోడ్డు షో చేయగా, జనం విపరీతంగా వచ్చారు. ఇక వీరి కాంబినేషన్‌తో రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రచారానికి వెళితే బాగా సక్సెస్ అవుతుందని వైసీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: