రాజకీయంగా ఎంత బలంగా ఉన్నా సరే వైసీపీలో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి. అలాగే వైసీపీలో ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతున్న మాట వాస్తవం. ఆ విషయం పై స్థాయిలో ఉండే వైసీపీ నాయకులకు అర్ధం కాకపోయినా...కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలకు బాగానే తెలుస్తోంది. అయితే ఎవరు పెద్దగా బయటపడటం లేదు. ఇక బయటపడినవారిని వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో కూడా తెలిసిందే.

కాకపోతే ఇక్కడ ఇతర పార్టీల వారు...న్యూట్రల్ వ్యక్తులు వ్యతిరేకంగా మాట్లాడితే పర్లేదు...సొంత పార్టీలోనే కొందరు కార్యకర్తలు...సొంత పార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పులని బహిరంగంగా మీడియా ముందు చెప్పేస్తున్నారు. ఉదాహరణకు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావులకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే మాట్లాడుతున్నారు. మీడియా సమావేశాలు పెట్టి మరీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని అంటున్నారు.

అయితే వీరే కాదు...ఇంకా కొందరు ఎమ్మెల్యేలపై ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. ఇలాంటి పరిస్తితులని చక్కదిద్దాలసిన బాధ్యత వైసీపీ అధిష్టానంపై ఉంది. లేదంటే ఇది చివరికి వైసీపీకి డ్యామేజ్ అయ్యేలా చేస్తుంది. ఇదిలా ఉంటే వైసీపీలో ఓ ఎంపీ తమ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన తప్పులని చక్కదిద్దుతున్నారు. అలాగే సొంత పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. అలా అండగా ఉంటున్న ఎంపీ ఎవరో కాదు....నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.

వాస్తవానికి చూసుకుంటే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని, సీనియర్ నేత మర్రి రాజశేఖర్ వర్గానికి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కానీ శ్రీకృష్ణ మాత్రం వారికి అండగా నిలబడ్డారు. తాజాగా వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు...ధాన్యం అంశంపై ప్రశ్నించాడని చెప్పి నరేంద్ర అనే రైతుని చెప్పు తీసి కొట్టబోయింది కాకుండా..ఆ రైతుపై రివర్స్‌లో కేసు పెట్టించి అరెస్ట్ చేయించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణ..గుంటూరు ఎస్పీతో మాట్లాడి రైతుకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పైగా ఆ రైతు వైసీపీ కార్యకర్త. ఇలా శ్రీకృష్ణ,..కింది స్థాయిలో వైసీపీని కాపాడుతూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: