కుప్పంలో గెలిస్తే ఆంధ్రప్రదేశ్ నే కాదు యావత్ భారత్ దేశాన్నే గెలిచిన విధంగా భావించాలన్న ధోరణిలో రాజకీయ పార్టీలు ఉన్నాయన్నది ఓ భావన.ఓ పరిశీలన కూడా! ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు రాజకీయ పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడం మినహా పెద్దగా సాధించేది ఏమీ లేదని ఈ నేపథ్యంలో ఎవరి కష్టం ఎవరి వైపు ఉంటుంది..ఎవరి గెలుపు ఎవరిని ప్రభావితం చేస్తుంది అని తేలాలంటే ఇంకొద్ది రోజులు ఇరు పార్టీల నాయకులకూ ఓపిక అవసరం.సంయమనం కూడా అవసరమే!
ఆంధ్రావనిలో రాజకీయాలు అన్నీ కుప్పం చుట్టూనే తిరుగుతున్నాయి.వీటిని నియంత్రించే శక్తి ఇప్పటికిప్పుడు ప్రజలకు లేదు కానీ పరిణామాలు మాత్రం రోజుకో రీతిలో మలుపు తీసుకుంటున్నాయి.అటు పెద్దిరెడ్డి,ఇటు చంద్రబాబు తమదైన వాదన వినిపిస్తూ క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు.కుప్పంను ముఖ్యమంత్రి జగన్-కు వచ్చే ఎన్నికల్లో కానుక ఇస్తానని పెద్దిరెడ్డి చెప్పడంతో ఈ సారి మాటలు మరియు వాటి తీవ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఈ కథలో ఎమ్మెల్సీ భరత్ వచ్చి చేరారు.చంద్రబాబుకు కొన్ని నీతులు కొన్ని సూక్తులు చెప్పారు.ఇలాంటివే గతంలో టీడీపీ చెప్పి ఉంటుంది.ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది.పదే పదే ప్రజలు అమ్ముడుపోయారు అని చంద్రబాబు అనరాదని హితవు చెప్పారు.అంటే ఓ విధంగా వారిని అవమాన పరిచినవిధంగానే ఉందని ఆ మాట అని కూడా చెప్పారు.వివరణ ఒకటి ఇచ్చారు. ఇక వైసీపీ తరఫున ఈ మాట వినేందుకు బాగుందని మళ్లీ మళ్లీ వాడకండి భరత్ అంటూ టీడీపీ తరఫున వాదన ఒకటి వినిపిస్తుంది. నోట్లు కుమ్మరించనిదే గెలుపు ఎక్కడ అని ఎద్దేవా చేస్తుంది.