అవును వైసీపీ తిరుగుబాటు ఎంపీ జగన్మోహన్ రెడ్డి ఇజ్జత్ కే సవాలు విసిరారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు డెడ్ లైన్ విధించారు. ఆయన పెట్టిన డెడ్ లైన్ లోగా అనర్హత వేటు వేయించాలని లేకపోతే చేతకాని వాళ్ళని అంగీకరించాలని చాలెంజ్ విసిరటం సంచలనంగా మారింది. ఫిబ్రవరి 5వ తేదీలోగా తనపై అనర్హత వేటు వేయించాలని చాలెంజ్ చేశారు. తనపై అనర్హత వేటు వేయించలేకపోతే తాము చేతగాని వాళ్ళమని అంగీకరించాల జగన్ కు చెప్పారు.
అనర్హత వేటు వేయించలేకపోయినా, చేతకాని అంగీకరించిన తర్వాత తానే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పటం గమనార్హం. అంతా బాగానే ఉందికానీ ఫిబ్రవరి 5వ తేదీని తిరుగుబాటు ఎంపీ ఎందుకని డెడ్ లైన్ గా విధించారు ? అన్నదే సస్పెన్సుగా మారింది. వైసీపీ-తిరుగుబాటు ఎంపీ మధ్య వ్యవహారం టామ్ అండ్ జెర్రీ షోలాగ తయారైంది. తనను ఎలాగైనా పార్టీ నుండి సస్పెండ్ చేయించుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు.
ఒకసారి పార్టీ నుండి సస్పెన్షన్ వేటు వేయించుకుంటే ఇక ఎంపీ ఫ్రీ బర్డ్ అయిపోతారు. అందుకనే ఎంపీ నోటికొచ్చినట్లు ఎంతగా మాట్లాడుతున్నా జగన్ మాత్రం ఆపని చేయటంలేదు. పైగా ఎంపీపై అనర్హత వేయించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంత ప్రయత్నించినా ఎంపీపై అనర్హత వేటు సాధ్యం కావటంలేదు. నిజానికి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా ఎంపీగా అనర్హత వేటు ఎప్పుడో పడుండాలి.
కేంద్రంలోని పెద్దలతో ఎంపీకున్న సన్నిహితం వల్ల జగన్ ప్రయత్నాలు ముందుకు పోవటంలేదు. తనపై అనర్హత వేటు వేయించలేరు, తాను రాజీనామా చేసేది లేదని ఆమధ్య చెప్పారు. వైసీపీ పరిస్ధితిని ఎంపీ బాగా అడ్వాంటేజ్ తీసుకుని నోటికొచ్చినట్లు ప్రతిరోజు జగన్ ప్రభుత్వంపైన బురద చల్లేస్తున్నారు. అయితే ఈమధ్యలో ఏమైందో ఏమో తనంతట తానే తొందరలో రాజీనామా చేయబోతున్నట్లు ఎంపీయే ప్రకటించారు.
తాజాగా తీనపై అనర్హత వేటుకు ఫిబ్రవరి 5వ తేదీని డెడ్ లైన్ గా విధించటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఎంపీ చాలెంజ్ ను బట్టి చూస్తే ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని అనుకోవాలి. ఎలాగూ రాజీనామా చేయాలని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇపుడే చేసేస్తే ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే నరసాపురం పార్లమెంటుకు కూడా ఉపఎన్నిక వచ్చే అవకాశముంది. ఎంతైనా రాజు కదా సపరేటుగా ఎన్నికలకు వెళ్ళాలని అనుకుంటున్నారేమో. చూద్దాం ఏమవుతుందో.