
అయితే ఈ కొత్త వేరియంట్ వలన ప్రమాదం ఎంతవరకు ఉంటుంది అంటే ఇపుడిపుడే ఒక నిర్ధారణకు రాలేమని పలువురు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇలాంటి అనూహ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న ఆలోచనలో పడింది. ముందస్తు జాగ్రత్తలు అప్రమత్తం చేసింది. ఇప్పటికే దేశంలో ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు మొదలయ్యాయి. అయితే కేసు తీవ్రత చూస్తుంటే లాక్ డౌన్ తప్పేలా లేదని అనిపిస్తోంది. అయితే ఇదే విషయంపై సర్కారు సందిగ్ధంలో ఉందని సమాచారం. ఓ వైపు పెరుగుతున్న కేసులు మరో వైపు మళ్ళీ విషమ పరిస్థితులు రిపీట్ అవుతాయేమోనన్న ఆందోళన.
కానీ ఏదేమైనా ప్రజల ప్రాణమే ముఖ్యమని పాలకులు భావిస్తున్నారు, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి త్వరలోనే లాక్ డౌన్ ఉండబోతుందా అంటే అవుననే వినిపిస్తోంది. అయితే ఈసారి దేశంలో లాక్ డౌన్ మొదలైతే మళ్ళీ వలస కూలీల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయి. గతంలో సోను సూద్ దేవుడిలా వీరిని చాలా వరకు ఆదుకోగా ఈసారి వీరిని కరుణించడం కోసం ఎవరు తమ దయ హృదయాన్ని చాటుకుంటారో చూడాలి.
ఆర్దికంగా ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అన్న ప్రణాళికలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఎలాంటి నిర్ణయాలు ప్రకటింపబడతాయో చూడాలి.