పరిస్ధితి చూస్తే అలాగే ఉంది. రాజకీయాలన్నాక మీడియా పాత్ర ఎంత ముఖ్యమో ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగునాట ఉన్న మీడియాలో అత్యధిక వైఎస్ కుటుంబానికి నూరుశాతం వ్యతిరేకంగా ఉన్నవే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే పద్దతి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నుండి మొదలై ఇపుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది.  ఒకవైపు గోరంతలను కొండతలుగా చూపిస్తు ఎల్లోమీడియా జగన్ కు వ్యతిరేకంగా రెచ్చిపోతోంది.




ఇదే సమయంలో జగన్ సొంతమీడియా మాత్రం మద్దతు విషయంలో పాకుతు, దేకుతోంది. జగన్ కు అనుకూలంగా ఉండే విషయాలను కూడా హైలైట్ చేయటంలో ఫెయిలవుతోంది. తాజాగా జగతి పబ్లికేషన్స్ లో క్విడ్ ప్రోకో జరిగిందనే విషయాన్ని తీసుకుందాం. జగన్ మీదున్న కేసుల్లో ఇది కూడా పెద్దదే. జగన్ రూపాయి పెట్టుబడి పెట్టకుండానే వ్యాపారస్తులకు ప్రభుత్వపరంగా లబ్ది చేకూర్చి వారినుండి కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకున్నారన్నది ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం చేసిన ప్రధాన ఆరోపణ.




దాదాపు పది సంవత్సరాలపాటు ఇదే విషయమై విచారణ జరిగి జరిగి చివరకు పోయిన నెల 23వ తేదీన ముంబాయ్ లోని ఇన్ కమ్ ట్యాక్స్ అప్పీలేట్ అథారిటి కేసును కొట్టేసింది. క్విడ్ ప్రోకో జరిగిందనేందుకు ఇన్ కమ్ ట్యాక్స్ శాఖ ఎలాంటి ఆధారాలను చూపలేకపోయిందని అథారిటి వ్యాఖ్యానించింది. ఆరోపణలతో ఆధరాలు లేకుండా కేసు పెట్టినందుకు అథారిటి శాఖను బాగా తలంటింది. అథారిటి ఇచ్చిన తీర్పు నిజంగా జగన్ కు చాలా ఊరటనిచ్చిందనే చెప్పాలి. 


 


జాతీయస్ధాయి ఇంగ్లీషు మీడియా అప్పట్లోనే ఈ వర్తను ప్రముఖంగా ప్రకటించింది. సరే మన తెలుగు మీడియా అసలది వార్తనే కదాన్నట్లుగా వ్యవహరించింది. కాబట్టి ఆ వర్తను ఎక్కడా ప్రచురించలేదు. మరి జగన్ సొంతమీడియా సాక్షి ఏమి చేయాలి. అథారిటి తీర్పు వచ్చిన వెంటనే హైలైట్ చేసుండాలి. కానీ చేసిందేమిటి ? ఇన్నిరోజుల తర్వాత జనవరి 13వ తేదీన బ్యానర్ స్టోరీగా రాసుకుంది. అంటే తీర్పొచ్చిన 21 రోజుల తర్వాత ఆ తీర్పును హైలైట్ చేసింది.




మరిలాంటి మీడియాను నమ్ముకుని జగన్ రేపు ఎన్నికల్లో ఎలా పోరాడగలరు ? ఒకవైపు చంద్రబాబునాయుడుకు మద్దతుగా 90 శాతం మీడియా రెచ్చిపోతోంది. ఇదే సమయంలో జగన్ కు మద్దతుగా నిలబడే మీడియా దాదాపు లేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్దితిలో సొంతమీడియా కూడా ఇంత డల్లుగా ఉంటే దీన్ని నమ్ముకుని జగన్ రాజకీయం చేయగలరా ? అందుకనే జగన్ను దేవుడే కాపాడాలంటు నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: