ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం మానవ వనరులు ఎక్కువగా ఉన్న భారత్ సహా మరికొన్ని దేశాలతో బ్రిటన్ చర్చలకు సిద్ధం అయింది అనే విషయం ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.. బ్రిటన్ లో ఏర్పడిన మానవ వనరుల కొరత కారణంగా డాక్టర్ల దగ్గర నుంచి డ్రైవర్ల వరకూ టీచర్ల దగ్గరనుంచి స్వీపర్ల వరకూ కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే అటు ఇండియా నుంచి ఎంతోమంది మేధావులను తమ తమ దేశాలలో ఉద్యోగాలకు తీసుకువెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక భారత్ బ్రిటన్ మధ్య వీసా విషయంలో ఉన్న ఆంక్షలను కూడా దీని కోసం ఎత్తివేసేందుకు సిద్ధమైన తెలుస్తోంది.
ఇప్పటికే సౌదీ అరేబియా సహా అరబ్ కంట్రీస్ అన్నీ కూడా తమ పంథా మార్చుకుని చట్టాలలో సడలింపులు ఇస్తూ భారత్ నుంచి మానవ వనరులను తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక బ్రిటన్ ఇప్పుడు కాస్త అప్రమత్తమైంది అని విశ్లేషకులు అంటున్నారు. వీసాల జారీ విషయంలో ఆంక్షలను తగ్గించి ఇక భారత నుంచి వచ్చే వారికి బ్రిటన్లో ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రస్తుతం భారత ప్రభుత్వంతో బ్రిటన్ ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చర్చలు ఎక్కడ వరకు వెళ్తాయ్ అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.