హిందూపురం పేరు చెప్పగానే...అందరికీ టీడీపీ కంచుకోట అని గుర్తొచ్చేస్తుంది. అంటే అంతలా హిందూపురం టీడీపీకి మద్ధతుగా నిలబడుతూ వస్తుంది. అయితే హిందూపురం అసెంబ్లీ స్థానం పూర్తిగా టీడీపీకి కంచుకోట అనే విషయం తెలిసిందే. అక్కడ టీడీపీ ఇంతవరకు ఓడిపోలేదనే సంగతి తెలిసిందే. అయితే హిందూపురం పార్లమెంట్ సీటు కూడా టీడీపీకి కంచుకోటే. పార్లమెంట్ స్థానంలో టీడీపీ అయిదుసార్లు గెలిచింది.
 
ఇక గత ఎన్నికల్లో అక్కడ తొలిసారి వైసీపీ జెండా ఎగిరింది. వైసీపీ నుంచి గోరంట్ల మాధవ్ విజయం సాధించారు. గోరంట్ల బ్యాగ్రౌండ్ ఏంటి...ఆయన వైసీపీలోకి ఎలా వచ్చారో అందరికీ తెలిసిందే. అయితే వైసీపీ ఎంపీగా ఉన్న ఆయనపై రెండున్నర ఏళ్లలో ప్రజా వ్యతిరేకత ఎక్కువ పెరిగినట్లు సర్వేలు వస్తున్నాయి. అసలు వైసీపీ ఎంపీల్లో ఈయనే అత్యధికంగా ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఈయన మళ్ళీ వైసీపీ నుంచి బరిలో దిగితే గెలవడం కష్టమని కూడా కథనాలు వస్తున్నాయి.

అందుకే ఈయనని మార్చేసి వేరే వాళ్ళకు సీటు ఇవ్వొచ్చని ప్రచారం కూడా వస్తుంది. ఇక మాధవ్‌కు సీటు ఇవ్వాలా? లేదా? అనేది జగన్ చేతుల్లో ఉంది. ఇక వైసీపీ విషయం పక్కన పెడితే ఇక్కడ టీడీపీ తరుపున ఎవరు బరిలో దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. గత కొన్ని ఎన్నికల నుంచి టీడీపీ తరుపున నిమ్మల కిష్టప్ప పోటీ చేస్తూ వస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఈయనే గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఇప్పుడు అక్కడ ఆయన అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. వయసు మీద పడటంతో కాస్త దూకుడు తగ్గించారు.

దీంతో ఈ సారి నిమ్మలని పక్కన పెడతారని ప్రచారం వస్తుంది. అలాగే హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న పార్థసారథిని బరిలో దించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈయన ప్రస్తుతం పెనుకొండ ఇంచార్జ్‌గా ఉన్నారు. అయితే అక్కడ వేరే వారికి అవకాశం ఇచ్చి...పార్థసారథిని హిందూపురం ఎంపీగా బరిలోకి దింపవచ్చని సమాచారం. చూడాలి మరి హిందూపురంలో వైసీపీ, టీడీపీ క్యాండిడేట్లు మారతారేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: