గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఇతర ప్రముఖుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఉగ్రవాద కుట్ర గురించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు హెచ్చరిక అందింది. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రధాని మోదీ మరియు ఇతర ప్రముఖులకు ముప్పు ఉందని సూచించింది.
లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి తీవ్రవాద గ్రూపులు ఈ ఉగ్ర ముప్పు వెనుక ఉన్నాయని ఇన్‌పుట్ పేర్కొంది. పాకిస్తాన్‌లో ఉన్న ఖలిస్తానీ గ్రూపులు పంజాబ్‌లో మిలిటెన్సీని పునరుద్ధరింపజేసేందుకు మరియు పునరుజ్జీవింపజేసేందుకు క్యాడర్‌లను కూడా సమీకరించుకుంటున్నాయని తెలిపింది. పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ లక్షిత దాడులకు ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 2021లో అందిన ఇన్‌పుట్ ప్రకారం, ఖలిస్తానీ టెర్రర్ గ్రూపులు ప్రధానమంత్రి సమావేశం మరియు పర్యటన వేదికలపై దాడికి ప్లాన్ చేస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి.ఈ వార్త వినగానే దేశ ప్రజలలో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఏం జరుగుతుందో అని భయపడుతుంది. దీంతో అన్ని నిఘా వర్గాలు అలర్ట్ అయిపోయాయి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరిని సున్నితంగా పరిశీలించే అవకాశం ఉంది.