ఏపి సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ పాట పాడిన ప్రభుత్వ ఉద్యోగి, వాహ్ వా అంటూ స్వరం కలిపిన మిగిలిన ఉద్యోగులు. తమ గోడు వినాలంటూ ఆలపించిన విధానం ఇపుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే....

ఆంధ్ర ప్రదేశ్ లో పీఆర్సీ ల గోల ఎప్పటినుండో జరుగుతున్న విషయం తెలిసిందే. పీఆర్సీ గురించి ప్రభుత్వ ఉద్యోగులు విన్నపాల మీద విన్నపాలు, నిరసనలు చేస్తూనే వచ్చారు. ఈ అంశం పై కమిటీల ఏర్పాటు, ఎన్నో సమావేశాలు, చర్చలు, వ్యతిరేకత వంటివి ఎన్నో జరిగియాయి. ఎట్టకేలకు గవర్నమెంట్ కాస్త దిగొచ్చి ఈ వివాదాలకు చెక్ పెట్టాలని పీఆర్సీని 23.29 శాతం ఫిట్ మెంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది జగన్ ప్రభుత్వం. అంతటితో ఈ పీఆర్సీ లొల్లి కి ఎండ్ కార్డ్ పడింది అనుకుంటే... కానే కాదు, ఈ లెక్క సమంజసం కాదు అంటూ మళ్ళీ ఆందోళనలు మొదలు పెట్టాయి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు. 


సర్కారు ప్రకటించిన పీఆర్సీ ఆమోద యోగ్యంగా లేదంటూ సర్వత్రా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపి వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నేడు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఆందోళన తెలిపారు. చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లా సహా పలు ఏపి జిల్లాల్లో ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఓ ఉద్యోగి చేసిన పని ఇపుడు వైరల్ గా మారింది. అదేంటంటే ఆ ఉద్యోగి ఏపీ సిఎం ను ఉద్దేశిస్తూ "మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి గారు మా గోడు వినండి..." అంటూ  పాట అందుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. 

ఇపుడు ఈ సన్నివేశం మరియు ఈ పాట సోషల్ మీడియాలో  చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ని పెంచుతారు అనే ఒక ఉద్దేశ్యంతోనే అన్నది తెలిసిందే. కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగి పాడిన పాటకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మనసు కరుగుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: