50 ఏళ్లు గా సరిగ్గా “ఇండియా గేట్” కింద నిరంతరం వెలుగుతున్న “అమర్ వాన్ జ్యోతి” శాశ్వతంగా ఆరిపోనుంది.  ఇండియా గేట్ పక్కనే 40 ఎకరాల్లో 176 కోట్ల తో ఏర్పాటు చేసి, 2019, మార్చి లో ప్రధాని మోడి ప్రారంభించిన “నేషనల్ వార్ మోమోరియల్” వద్ద ఏర్పాటు చేసిన “జ్యోతి” లో కలవనున్నారు.  ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రక్షణ దళాల ఎయుర్ మార్షల్ బలభద్ర  రాధా కృష్ణ ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఈ రెండు జ్యోతులను ఏకం చేయనున్నారు.  గణతంత్ర దినోత్సవాలకు సరిగ్గా 5 రోజులు ముందు ఈ మార్పును రక్షణ శాఖ ఆధ్వర్యంలో జరగనుంది. [10:52 AM, 1/21/2022] +91 76600 12447: 1914-1921 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుధ్దంలో  మరణించిన “బ్రిటీష్-ఇండియా సైన్యానికి” చెందిన సైనికుల సంస్మరణార్ధం అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఇండియా గేట్ ను నిర్మించింది. 

1971 లో పాకిస్థాన్ తో జరిగిన యుద్దంలో ప్రాణాలు కోల్పోయిన భారత వీర సైనికుల సంస్మరణార్ధం “ అమర్ జవాన్ జ్యోతి” ని 1972 లో ఏర్పాటు చేయడం జరిగింది.1947-48 లో పాకిస్థాన్ తో జరిగిన యుధ్దం నుంచి ఇటీవల గాల్వన్ వాలీ లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల పేర్లే కాకుండా,  “ఇండియా గేట్” కట్టడం పై ఉన్న సైనికుల పేర్లను కూడా “నేషనల్ వార్ మెమోరియల్” ( రాష్ట్రీయ సమర్ స్మారక్) లో గ్రానైట్ పలకల పై సువర్ణ అక్షరాలతో లిఖించారు.  తీవ్రవాదులను తుదముట్టించే “ఆపరేషన్‌”లే కాకుండా, వివిధ సందర్భాలలో  దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంస్మరణార్ధం ఏర్పాటైన “నేషనల్ వార్ మెమోరియల్” లో మొత్తం 25,942 సైనికుల పేర్లను సువర్ణ అక్షరాలతో లిఖించడం జరిగింది.  కాబట్టి, రెండు చోట్ల జ్యోతులు కాకుండా ఇక నుంచి ఓకే “అమర్ జవాన్ జ్యోతి” వెలిగేలా ఏర్పాట్లు చేశారు.

—-


మరింత సమాచారం తెలుసుకోండి: