
వ్యూహం ప్రకారం ప్రజల కనీస అవసరాలు తీర్చడానికే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దేశానికి స్ఫూర్తి దాయకమన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. తెలంగాణ లో ఈ రోజు అమలు అవుతున్న పథకాలు దేశంలో రేపు అమలు అవుతున్నాయి...మంచినీటి సరఫరా, రైతు బంధు పథకాలు కేంద్రం అమలు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరా అవుతుంది...కొండపోచంపల్లి నుంచి గండి పేటకు మంచినీటి సరఫరాకు సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏర్పాటు కాగానే 2 వేల కోట్ల తో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకున్నామని.. హైదరాబాద్ అంటే... ghmc ఒక్కటే కాదు... ORR లోపల ఉన్న 25 మున్సిపాలిటీలను హైదరాబాద్ గా గుర్తించాలని తెలిపారు రాష్ట్ర మంత్రి కేటీఆర్.