ఇకపోతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒకరికి ఓటు హక్కు కల్పించేందుకు అటు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఇక ప్రతి ఏటా ఎంతగానో అవగాహన కల్పిస్తూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతుంది భారత ప్రభుత్వం. నేడు అందరూ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే 1950 జనవరి 25వ తేదీన ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇదే రోజు ఎన్నికల సంఘం ఆవిర్భవించిన రోజు కావడం గమనార్హం. ఇక ప్రతి ఏడాది సరికొత్త నినాదం తో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం చూస్తూ ఉంటాం.
అయితే జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున ప్రతి ఏటా బూత్ స్థాయిలో ఆన్లైన్లో కూడా 18 సంవత్సరాల నుండి ఇంకా ఓటర్ ఐడీ కార్డు నమోదు చేసుకోని వారికి కొత్త ఓటర్ నమోదు దరఖాస్తులను స్వీకరిస్తూ ఉంటారు. అదే సమయంలో దొంగ ఓట్లను నివారించాలనే లక్ష్యంతో పలు కొత్త రూల్స్ కూడా తెరమీదకు తీసుకురావడం కూడా చేస్తూ ఉంటారు. కాగా ప్రస్తుతం ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డును అనుసంధానం చేయడం జరుగుతుంది అనే విషయం తెలిసిందే దాదాపు దేశంలో ఉన్న అందరి ఓటర్ ఐడి కార్డులు కూడా ఆధార్ కార్డులతో అనుసంధానం అయ్యాయి.