క్షేత్రస్ధాయిలో జరుగుతున్న విషయాలు చూస్తుంటే అదే అనుమానంగా ఉంది. బీజేపీ అంటే ఏపీ బీజేపీ కాదులేండి. తెలంగాణాలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్ట్రాటజీనే ఏపీలో చంద్రబాబునాయుడు ఫాలో అవుతున్నట్లుంది. తెలంగాణాలో బండి+బీజేపీ నేతలు ఏమి చేస్తున్నారు ? ప్రతి రోజు ఏదో ఒక అంశం తీసుకుని రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట నానా గోల చేస్తున్నారు. తాము చేస్తున్న రచ్చలో భాగంగా ఉద్రిక్తతలు సృష్టించటం, పోలీసులతో దెబ్బలు తినటం, అరెస్టవటం జనాలు దృష్టిని తమవైపుకు మళ్ళించుకోవటం.
సేమ్ టు సేమ్ ఏపీలో చంద్రబాబు స్ట్రాటజీ కూడా అలాగే ఉంది. మొన్న మాచర్లలో తమ కార్యకర్త చంద్రయ్య హత్యన్నారు. రెండు రోజుల పాటు నానా గలో చేశారు. హత్యకు గురైన వ్యక్తి అంతకుముందు కొన్ని హత్యకేసుల్లో నిందితుడన్న విషయాన్ని చంద్రబాబు అండ్ కో దాచిపెట్టారు. చంద్రయ్య హత్య వ్యక్తిగత కక్షల నేపధ్యంలోనే జరిగింది. అయినా ఆ హత్యను ప్రభుత్వానికి, అధికారపార్టీకి చుట్టేసి నానా గోల చేశారు. అంతుకుముందు కర్నూలులో జరిగిన మరో హత్య కూడా వైసీపీ నేతల పనే అంటు గోల గోల చేశారు. తీరా చూస్తే అది కుటుంబ కలహాల వల్లే జరిగిందని బయటపడింది.
తాజాగా గుడివాడలో మంత్రి కొడాలి నాని క్యాసినో నడిపించారంటు వారం రోజులుగా గోల చేస్తునే ఉన్నారు. ఒక ప్లాన్ ప్రకారమే నిజనిర్ధారణ కమిటి అంటు గుడివాడకు వెళ్ళి ఉద్రిక్తలు కల్పించారు. దాని తర్వాత తమపై హత్యాయత్నం జరిగిందంటు నానా గోల చేస్తున్నారు. ఇపుడేమో కొడాలి రాజీనామా చేయాలంటున్నారు. కొడాలిని బర్తరఫ్ చేయకపోతే క్యాసినో ద్వారా వచ్చిన డబ్బులో జగన్మోహన్ రెడ్డికి కూడా భాగముందని అనుకుంటారట. అసలు టీడీపీ డిమాండ్లకు, వాళ్ళు చేసే యాక్షన్ మామూలుగా ఉండదు. 90 శాతం మీడియా వీళ్ళకు మద్దతుగా ఉండటంతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుంటారు.
గుడివాడలో క్యాసినో పేరుతో చేస్తున్న రచ్చంతా ప్రజలకు సంబంధించిన అంశాలపైన పెడితే బాగుంటుంది. ఎందుకంటే క్యాసినో జరిగినా జరగకపోయినా మామూలు జనాలకు ఏమీ సంబంధంలేదు. జనాలకు ఉపయోగపడే అంశాల్లో గోల చేయటానికి ఏమీలేకే చివరకు ఇలాంటి విషయాలను పట్టుకుని చంద్రబాబు అండ్ కో నానా గోల చేస్తున్నట్లుంది. కొడాలి మీద పేరుకుపోయిన మంటను క్యాసినో పేరుతో తీర్చుకోవాలని తమ్ముళ్ళు ప్లాన్ చేసినట్లున్నారు. మొత్తంమీద ఏదో ఒక అంశాన్ని తీసుకుని ప్రతిరోజు రచ్చ చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లుంది. మరి వాళ్ళ ప్లాన్ వర్కవుటవుతుందా ?