ఇక్కడ మొదట నుంచి టీడీపీకి మంచి విజయాలు దక్కలేదు..1984లో ఒకసారి...1999లో మరొకసారి ఇక్కడ టీడీపీ గెలిచింది. మళ్ళీ 2014 ఎన్నికల్లో గెలిచింది. ఈ మూడు సార్లు మాత్రమే అనంత పార్లమెంట్‌లో టీడీపీ గెలిచింది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై తెలుగు తమ్ముళ్ళు బాగానే ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ జేసీ దివాకర్ రెడ్డి వారసుడు పవన్ రెడ్డి పోటీ చేశారు.
పార్లమెంట్ స్థానంలో క్రాస్ ఓటింగ్ జరిగి పవన్ గెలుస్తారని అనుకున్నారు...కానీ అనూహ్యంగా పవన్...లక్షా 41 వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్ధి తలారి రంగయ్య చేతిలో ఓడిపోయారు. అయితే అనంత పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 6 చోట్ల ఓడిపోయింది..ఒక్క ఉరవకొండలో మాత్రమే గెలిచింది. ఇలా అసెంబ్లీ స్థానాల్లో ఓటమి పాలవ్వడం పవన్‌కు బాగా మైనస్ అయింది. అందుకే ఆయనకు గెలవడం సాధ్యపడలేదు. కానీ ఈ సారి మాత్రం పరిస్తితి మారుతుంది..అనంతలో సైకిల్ స్పీడ్ పెరుగుతుంది...ఫ్యాన్ స్పీడ్ తగ్గుతుంది. అలాగే పవన్ దూకుడుగా పనిచేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా గెలవాలనే కసితో పవన్ పనిచేస్తున్నారు.
ప్రస్తుతం అసెంబ్లీ స్థానాల్లో పరిస్తితి చూస్తే...ఉరవకొండ, తాడిపత్రి, కళ్యాణదుర్గం స్థానాల్లో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉంది. గుంతకల్లు, రాయదుర్గంలో ఇప్పుడుప్పుడే టీడీపీ పరిస్తితి మెరుగు అవుతుంది. అనంత అర్బన్, శింగనమల స్థానాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికలనాటికి ఇంకా టీడీపీకి అనుకూలంగా మారేలా ఉంది...అప్పుడు అనంత పార్లమెంట్‌లో పవన్ గెలవడానికి రూట్ క్లియర్ అయ్యేలా ఉంది.