పంజాబీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందస్తుగా సిఎమ్ అభ్యర్ధి పేరును ప్రకటిస్తుందన్నారు రాహుల్ గాంధీ.  అయుతే, కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు,  పంజాబ్ ప్రజలు కోరుకుంటేనే ముందస్తు ప్రకటన చేస్తామన్న రాహుల్ గాంధీ... ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది నిర్ణయంచుకోవాల్సిందిగా  పార్టీ కార్యకర్తలను కోరతామన్నారు.  సిఎమ్ చరణ్ జిత్ సింగ్, పిసిసి అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిధ్దు ల మధ్య కొనసాగుతున్న వైరం నేపధ్యంలో రాహుల్ గాంధీ వ్సాఖ్యలకు ప్రాధాన్యత ఉంటుందని..  ఇద్దరు నాయకత్వం వహించలేరు. కేవలం ఒక్కరే అని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.  ఒకరు నాయకత్వం వహిస్తే, మరొకరు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇద్దరి హృదయాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉందని..  ముఖ్యమంత్రి పదవి కోసం పాకులాడబోమని ఇద్దరు నేతలు కూడా  బాహాటంగా ప్రజలకు హామీ ఇస్తారన్నారు.


  ఆ తర్వాత నే రాహుల్ గాంధీ ప్రకటన ఉంటుంది.  అయుతే, ముఖ్యమంత్రి అభ్యర్థి పై రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సిధ్దు హామీ ఇచ్చారు.   ప్రస్తుత సంక్షోభం నుంచి మనల్ని గట్టెక్కించే వారెవరా అని ప్రజల మనస్సుల్లో ప్రశ్న ఉందన్న సిధ్దు..  అయుతే, దానికి మార్గం ఏమిటన్నది ప్రజల మనసుల్లో ఉన్న రెండవ ప్రశ్న అని చెప్పారు.  ఇక ఈ సంస్కరణలను అమలు చేసేది ఎవరన్నది ప్రజల మనసుల్లో ఉన్న మూడవ ప్రశ్న అని చెప్పిన సిధ్దు... క్రమశిక్షణ గల ఓ సైనికుడి లా రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నా అని ప్రకటించారు.  మేమంతా సమిష్టిగా ఉన్నాం. మేమంతా ఒకరిపై ఒకరు పైచేయి సాధించడం కోసం పోట్లాడుకోవడం లేదని వెల్లడించారు.  మేం పోరాటం అంతా తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసిందుకు మాత్రమే. అందుకోసం, అవసరమైతే, నాకు నష్టం జరిగినా పర్వాలేదు. గొంతెత్తి మాట్లాడను. కానీ, నిర్ణయాలను తీసుకునే అధికారం, స్వేఛ్చ నివ్వండన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: