ప్రపంచ దేశాల్లోనే టెక్నాలజీలో ఉరకలు వేస్తున్న దేశం అది. ఆడ, మగ సమానమని చాటి చెప్పే విజ్ఞానవంతులు ఉన్న ఆ గడ్డ మీద ఇంకా ఆడపిల్లలపై అసమానతలు పోలేదు. అమ్మతనానికి అవమానంగా భావించే కన్యత్వాన్ని అంగట్లో పెట్టినట్టు పెట్టేశారు. అంతటి క్రూర కన్యత్వ పరీక్షలు జరిపే దేశం ఏమిటో, అసలు ఆ పరీక్షలు ఎందుకు చేస్తున్నారో తెలుసుకుందామా..? నిజానికి కన్యత్వం అనేది ఒట్టి మూర్ఖపు భావన అనేది తెలుసుకోవాలి.
కన్యత్వ పొర స్త్రీ లైంగిక చర్యల్లో పాల్గొనే వరకు ఉంటుందనే దానికి ఎటువంటి శాస్త్రీయత లేదని, అది కేవలం సంభోగ సమయంలో మాత్రమే తెగుతుంది అనుకోవడం  అమాయకత్వం అని అది ఏ సందర్భంలోనైనా తొలగి పోవచ్చని అలాంటి అశాస్త్రీయ నమ్మకాలు పెట్టుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్త్రీల పాలిట శాపంగా మారిన హైవేనోప్లాస్టి సర్జరీలు, ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనిపై భారత్ లో మాత్రం 2013 లో సుప్రీం కోర్ట్ వేటు వేసింది. టు ఫింగర్ టెస్ట్ గా పిలిచే ఈ కన్యత్వ  పరీక్షలపై నిషేధాన్ని విధించింది.
 అలాగే బ్రిటన్ లో శాస్త్రీయమైన కన్యత్వ పరీక్షలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కన్యత్వ పునరుద్దారన పేరుతో ఆస్పత్రులు పెద్ద దందాను  నడుపుతున్నాయి.  ఈ దందా యువతుల పాలిట శాపంగా మారింది.  అక్కడి ఆసుపత్రిలో  40 నిమిషాల్లో కన్నెపొర రిపేరు చేస్తామని  నమ్మిస్తూ ఈ దందాను  సాగిస్తున్నారు. ఈ పాశవిక చర్యతో యువతులపై వారి తల్లిదండ్రులే ఒత్తిడి తీసుకువచ్చి  ఈ ఆపరేషన్లు చేస్తున్నారు అంటే ఇది అక్కడ ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు.

ఒక్కొక్క ఆపరేషన్ కి 20 నుంచి 30 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలా బ్రిటన్ ఆసుపత్రుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఇది ముమ్మాటికీ స్త్రీల శారీరక హక్కుల్ని కల రాయడమే అని అంతర్జాతీయ స్త్రీ ఉద్యమకారులు గళమెత్తి నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ ప్రభుత్వం కూడా గత ఏడాది కన్యత్వ  పరీక్షలను నిషేధిస్తామని హామీ ఇచ్చింది. తాజాగా ఆరోగ్య సవరణ బిల్లులో ఈ నేరపూరిత పరీక్షలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు చూస్తే మనం ఇంకా ఆటవిక సమాజంలోనే బ్రతుకుతున్నామా అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: